కాంగ్రెస్‌ నేతలకు ఎందుకు ఆ శ్రమ?

August 17, 2018


img

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ్యత్వాల పునరుద్దరణ విషయంలో  ప్రభుత్వానికి, హైకోర్టుకు మద్య ప్రతిష్టంభన కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. దానికి సంబందించి కోర్టు ధిక్కారం కేసులో అసెంబ్లీ స్పీకర్, డిజిపి, గద్వాల్, నల్గొండ ఎస్.పిలకు హైకోర్టు నోటీసులు కూడా పంపించింది. కనుక నాయస్థానమే ఈ వ్యవహారాన్ని చూస్తున్నప్పుడు మళ్ళీ మధ్యలో ఎవరూ జోక్యం చేసుకోనవసరం లేదు. కానీ సిఎల్పీ నేత జానారెడ్డి ఈ వ్యవహారంపై టిఆర్ఎస్‌ సర్కారును నిలదీశారు. 

ఆయన సిఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “ఈ వ్యవహారంలో హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం వాటిని ఎందుకు పాటించడం లేదు? స్పీకరుకు నోటీసు ఇచ్చినా ప్రభుత్వం స్పందించదా? టిఆర్ఎస్‌ సర్కారుకు న్యాయస్థానాలపై, రాజ్యాంగ వ్యవస్థలపై, ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని స్పష్టం అవుతోంది. సిఎం కెసిఆర్‌ ఇకనైనా ఈ వ్యవహారంలో పంథానికి పోకుండా మా ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాల పునరుద్దరించి, వారికి భద్రత కల్పించి, వారికి బాకీ ఉన్న జీతభత్యాలను తక్షణమే చెల్లించాలని కోరుతున్నాను. కొందరు (కేటీఆర్) తమ స్థాయిని మరిచి కాంగ్రెస్ పార్టీని, మా నేతలను ఉద్దేశ్యించి నీచంగా మాట్లాడుతున్నారు. అటువంటి కుసంస్కారుల మాటలకు నేను స్పందించను,” అని అన్నారు.


Related Post