సిఎం కెసిఆర్‌ సంచలన ప్రకటన

August 13, 2018


img

సోమవారం మధ్యాహ్నం తెలంగాణా భవన్ లో సిఎం కెసిఆర్‌ అధ్యక్షతన టిఆర్ఎస్‌ పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్‌ ఒంటరిగానే పోటీ చేస్తుంది. సెప్టెంబరు 2న హైదరాబాద్‌ అవుటర్ రింగ్ రోడ్డు వద్ద ‘ప్రగతి నివేదన’ పేరుతో ఒక బారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తాము. సెప్టెంబరు నెల నుంచే మా పార్టీ అభ్యర్ధుల పేర్లను ప్రకటిస్తాము. కేంద్రం ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానం అనుసరించడం సరికాదు. ముఖ్యంగా రిజర్వేషన్లు, ప్రాజెక్టులకు నిధులు అందించడం విషయంలో తేడాలు పాటించడం సరికాదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వలేకపోయినా దాని నిర్మాణం కోసం కనీసం రూ.20,000 కోట్లు ఇవ్వాలని తీర్మానం చేశాము. అలాగే పంటలకు గిట్టుబాటు ధరలు ప్రకటించాలని మరో తీర్మానం చేశాము. ఈరోజు జరిగిన కార్యవర్గ సమావేశంలో తొమ్మిది తీర్మానాలు చేశాము. వాటిని ఆమోదించవలసిందిగా కేంద్రాన్ని కోరుతాము,” అని చెప్పారు. 

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో బహిరంగ సభలు నిర్వహిస్తున్న సమయంలోనే సిఎం కెసిఆర్‌ సెప్టెంబరులోనే టిఆర్ఎస్‌ అభ్యర్ధుల జాబితా విడుదల చేస్తామని చెప్పి కాంగ్రెస్ నేతలకు పెద్ద షాక్ ఇచ్చారు. నిజానికి ఎన్నికలకు 6-12 నెలలు ముందుగా అభ్యర్ధుల పేర్లను ప్రకటిస్తామని ఇదివరకు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కానీ ప్రతిపక్ష కాంగ్రెస్ కంటే ముందు అధికార పార్టీయే ఎన్నికల సన్నాహాలు మొదలుపెట్టడం విశేషం. కెసిఆర్ చేసిన ఈ ప్రకటనతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలలో కూడా తప్పకుండా వేడి పుడుతుంది. అభ్యర్ధుల పేర్ల ప్రకటన కోసం పార్టీపై ఒత్తిడి మొదలవుతుంది.


Related Post