తెలంగాణాలో ప్రజాస్వామ్యం పరిడవిల్లుతోంది: కేటిఆర్

May 19, 2018


img

తెలంగాణా ఉద్యమ పార్టీ తెరాసయే అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో నిరంకుశ, అప్రజాస్వామిక పాలనసాగుతోందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. కెసిఆర్ నియంతృత్వం కారణంగానే తెలంగాణా జనసమితి (టిజెఎస్)ని ఏర్పాటు చేయవలసి వచ్చిందని అ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం చెపుతున్నారు. కానీ తెలంగాణాలో ప్రజాస్వామ్యం పరిడవిల్లుతోందని కాంగ్రెస్, జెడిఎస్ పార్టీలు నమ్మినందునే వారి ఎమ్మెల్యేలను బెంగళూరు నుంచి హైదరాబాద్ కు తీసుకువచ్చారని మంత్రి కేటిఆర్ అన్నారు. భాజపాతో సహా ఏ రాజకీయ పార్టీకైనా తెలంగాణాలో అధికారం సాధించడమే లక్ష్యంగా నిరభ్యంతరంగా పనిచేసుకోవచ్చునని కేటిఆర్ అన్నారు. తెలంగాణా జనసమితి (టిజెఎస్) తెరాసకు పోటీ కానేకాదని కేటిఆర్ అన్నారు. 

కాంగ్రెస్ నేతల గురించి మాట్లాడుతూ, తెరాస టికెట్లు ఇస్తామంటే తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కాంగ్రెస్ నేతలందరూ కట్టకట్టుకొని తెరాసలో చేరిపోతారని కేటిఆర్ ఎద్దేవా చేశారు.  కాంగ్రెస్ నేతలు మనసులో ఒకటుంచుకొని పైకి మరొకటి మాట్లాడుతుంటారని అన్నారు. అధికార కాంక్షతోనే కాంగ్రెస్ నేతలు ఆచరణ సాధ్యంకాని హామీలు గుప్పిస్తున్నారని కేటిఆర్ అభిప్రాయపడ్డారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చినా వచ్చే ఎన్నికలలో ప్రజలు మళ్ళీ కెసిఆర్ కే పట్టం కట్టడం ఖాయమని కేటిఆర్ అన్నారు. వచ్చే ఎన్నికలలో తెరాస నినాదం కెసిఆరేనని అన్నారు. కెసిఆర్ ను, తెరాసను వేరు చేసి చూడలేమని కేటిఆర్ అన్నారు. కెసిఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తెరాసకు శ్రీరామరక్షగానిలుస్తాయని కేటిఆర్ అన్నారు. 


Related Post