ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం

June 26, 2016


img

నల్గొండ జిల్లాలోని పాలమూరు గ్రామంలో ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం అత్యంత ప్రసిద్ధి గాంచింది. ఇక్ష్వాకు కాలం నుండి ఉన్నా కూడా, అక్కడి చుట్టు పక్కల కొన్ని గ్రామాలకు తప్ప, ఈ గుడి గురించి నేటి తరం వాళ్ళకి పెద్దగా తెలియదు.

ఇక ఈ ఆలయ ప్రత్యేకతల విషయానికొస్తే, అక్కడి శివలింగం పై ఉండే నీడ, రోజంతా అలాగే ఉంటుందనేది పూర్వీకులు చెప్పారు, అదే విధంగా, ఆ గుడి గురించి తెలిసిన ఇప్పటివాళ్ళు కూడా దీన్నే బలంగా నమ్ముతారు. కుందురు చోళులచే అత్యంత సుందరంగా, జనారణ్యం లేని ఒక ప్రాంతంలో నిర్మింపబదిన ఈ గుడికి, ఈ రోజుకి కూడా చుట్టు పక్కల పెద్దగా జనాలు లేకపోవడం గమనర్హం.

పడమర వైపు ఉంటూ, తూర్పు దిక్కుని చూపించే ఒక గర్భగుడి కి సంబంధించిన నీడ, ఇప్పటికీ పెద్ద అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. దీని వల్లే గుడికి 'ఛాయా' సోమేశ్వర స్వామి ఆలయంగా పేరొచ్చింది. ప్రధానంగా ఈ ప్రత్యేకత కోసమే, ఈ నాటికీ ఈ గుడి గురించి చెప్పుకోవడం జరుగుతుంది.



Related Post