నాగం చేరికతో కాంగ్రెస్ లో ముసలం?

April 25, 2018


img

భాజపా నేతలు నాగం జనార్ధన్ రెడ్డి, ఆది శ్రీనివాస్ ఇద్దరికీ రాహుల్ గాంధీ స్వయంగా కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోబోతున్నారు. తమ రాజకీయ శత్రువులైన వారిని పార్టీలో చేర్చుకోవద్దని, చేర్చుకొంటే వారికి సహకరించబోమని డికె అరుణ వర్గీయులు చెపుతున్నపటికీ కాంగ్రెస్ అధిష్టానం వారి అభ్యంతరాలను, హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోకుండా వారిరువురినీ ఇవ్వాళ్ళ పార్టీలో చేర్చుకొంటోంది. కనుక వారిరువురికీ వచ్చే ఎన్నికలలో టికెట్స్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది.

వారిని పార్టీలో చేర్చి టికెట్స్ ఇప్పించడానికి జైపాల్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, తద్వారా సరిగ్గా ఎన్నికల సమయంలో జిల్లాలో పార్టీని బలహీనపరుస్తున్నారని ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కనుక నాగం, ఆది శ్రీనివాస్ చేరికతో రానున్న రోజులలో కాంగ్రెస్ నేతల మద్య విబేధాలు మరింత పెరిగే అవకాశం ఉందని స్పష్టం అవుతోంది. వారిచేరికతో పార్టీని బలోపేతం చేసుకొందామనుకొంటే ఈ విభేధాల కారణంగా పార్టీ బలహీనపడే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఈ పరిణామాలు తెరాసకు సానుకూలంగా మారవచ్చు. Related Post