రేప్ చేసినా సినిమా ఛాన్స్ ఇస్తున్నారు కదా!

April 24, 2018


img

“బయట మగాళ్ళు అమ్మాయిలను రేప్ చేసి వదిలేస్తుంటారు. కానీ సినీ పరిశ్రమలో అలాకాదు. ఆ అమ్మాయిలను రేప్ చేసినా తరువాత వాళ్ళకు సినిమాలలో నటించే అవకాశాలు కల్పిస్తున్నారు. అంటే ఆవిధంగానైనా కొంతమందికి తిండి దొరుకుతోంది కదా? నిజానికి సినీ పరిశ్రమలోనే కాదు అన్ని రంగాలలో ఈ సమస్య ఉంది. కానీ ఒక్క సినీ పరిశ్రమలోనే ‘క్యాస్టింగ్ కౌచింగ్’ జరుగుతోందని అందరూ మావెంటపడతారెందుకో అర్ధం కాదు. సినీ పరిశ్రమలోకి వస్తున్న అమ్మాయిలు దీనికి అంగీకరించాలా వద్దా? అని వారే నిర్ణయించుకోవాలి. వద్దనుకొంటే సినీ పరిశ్రమకు దూరంగా ఉండటమే మంచిది. నిజంగా ట్యాలెంట్ ఉంటే మరొకరికి లొంగవలసిన అవసరం ఏమిటి? ఇది ఎవరికివారు ఆలోచించి నిర్ణయించుకోవలసిన విషయం.” 

ఇంత దారుణంగా మాట్లాడింది ఒక మహిళ. ఆమె కూడా సినీ పరిశ్రమలోనే ఉంది. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ లో ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్. 



Related Post