అసదుద్దీన్ ద్వంద వైఖరికి నిదర్శనం కాదా?

April 19, 2018


img

మక్కా మసీదు ప్రేలుళ్ళకేసులో సరైన సాక్ష్యాధారాలు లేనందున నామపల్లి ఎన్ఐఏ కోర్టు ఐదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించి, కేసు కొట్టివేయడాన్ని మజ్లీస్ అధినేత అసదుద్దీన్ తప్పు పట్టారు. ఈ తీర్పు వెనుక కేంద్రం, ఆర్ఎస్ఎస్ తదితర హిందుశక్తుల ఒత్తిళ్ళున్నాయని ఆరోపించారు. ఎన్ఐఏ కోర్టు ఈ కేసును కొట్టేయగానే భాజపా నేతలు మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకొన్నారని ఆరోపించారు. కోర్టు తీర్పుపై భాజపా హర్షం వ్యక్తం చేయడాన్ని అసదుద్దీన్ తప్పు పట్టారు. ఓ కేసులో ప్రభుత్వం భాదితుల తరపు కాకుండా నిందితుల పక్షాన్న నిలవడం బహుశః దేశచరిత్రలో మొదటిసారికావచ్చు. మోడీ సర్కార్ ఈ తప్పును గత కాంగ్రెస్ ప్రభుత్వంపైకి నెట్టేసి చేతులు దులుపుకొంటోంది. కానీ అజ్మీర్ దర్గా ప్రేలుడులో ఇద్దరు నిందితులు దోషులుగా ప్రకటించబడిన సంగతి మరిచినట్లు నటిస్తోంది. మక్కా మసీదు ప్రేలుళ్ళ కేసులో భాధితులకు న్యాయసహాయం అందించేందుకు మేము సిద్దంగా ఉన్నాము,” అని అన్నారు. 

పరమ పవిత్రమైన మక్కా మసీదుపై బాంబుదాడి చేయడం క్షమించరాని నేరమే. 1 ఏళ్ళపాటు ఈకేసును విచారించిన తరువాత ఈ కేసులో ఎవరినీ దోషులుగా నిర్ధారించలేకపోవడానికి కారణాలు ఏమిటో అందరూ ఊహించగలరు. కనుక ఈ విషయంలో అసదుద్దీన్ వాదనను తప్పు పట్టలేము. కానీ ప్రభుత్వం భాధితుల తరపుకాకుండా దోషుల తరపు నిలబడిందని వాదిస్తున్న ఇదే అసదుద్దీన్ ఓవైసీ, హైదరాబాద్ కు చెందిన ఐదుగురు యువకులకు ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధం ఉందని ఎన్ఐఏ అరెస్ట్ చేసినప్పుడు వారికి న్యాయసహాయం అందించడమే కాకుండా తన నిర్ణయాన్ని గట్టిగా సమర్ధించుకొన్నారు. భారత్ లో జరిగిన అనేక ఉగ్రవాదుల దాడులలో వందలాది మంది ప్రజలు, సైనికులు చనిపోయినప్పుడు నోరువిప్పని అసదుద్దీన్ ఇప్పుడు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇది ద్వందవైఖరి కాదా? 


Related Post