తెరాసది ద్వంద వైఖరి: రేవంత్ రెడ్డి

March 17, 2018


img

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తెరాసపై తీవ్ర విమర్శలు చేశారు. “ముఖ్యమంత్రి కెసిఆర్ ఒకపక్క తాము మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నామని, ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నానని చెపుతుంటారు. మరోపక్క మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా తెదేపా, వైకాపాలు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే అవి చర్చకు రాకుండా తెరాస ఎంపిలు సభలో ఆందోళనలు చేస్తూ అడ్డుపడుతుంటారు. ఇది తెరాస ద్వంద వైఖరికి నిదర్శనం. కెసిఆర్ ప్రధాని నరేంద్ర మోడీతో లాలూచీ పడినందునే, అవిశ్వాస తీర్మానాల వలన మోడీ సర్కార్ కు నష్టం జరగకుండా అడ్డుపడుతున్నారు. తెరాస ఎంపిలు పార్లమెంటులో భాజపా తరపున శిఖండి పాత్ర పోషిస్తున్నారు. తెరాసకు చిత్తశుద్ధి ఉంటే, తెదేపా, వైకాపాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపి తన నిజాయితీని నిరూపించుకోవాలి,” అని రేవంత్ రెడ్డి తెరాసకు సవాలు విసిరారు. 

తెదేపా, వైకాపాల అవిశ్వాస తీర్మానాలకు తెరాస మద్దతు ఇస్తుందని ఆ పార్టీ నేత కర్నే ప్రభాకర్ నిన్ననే ప్రకటించారు. కానీ తెరాస సభ్యుల ఆందోళన కారణంగానే అవిశ్వాస తీర్మానాలను పార్లమెంటులో చర్చకు రాలేకపోతే అప్పుడు రేవంత్ రెడ్డి ఆరోపణలే నిజమని నమ్మవలసి వస్తుంది. కనుక తెరాస తన చిత్తశుద్ధిని నిరూపించుకోవలసి ఉంది. 



Related Post