రాహుల్ కి కూడా తెలుగువారంటే చులకనేనా?

February 17, 2018


img

రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత తల్లి సోనియా గాంధీ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రద్దు చేసి, దాని స్థానంలో కొత్త కమిటీని ఏర్పాటు చేసుకొనేవరకు 34 మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులతో కూడిన కొత్త స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసుకొన్నారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణా కాంగ్రెస్ చాలా కీలకపాత్ర పోషించబోతోంది కనుక దాని ప్రాధాన్యతను గుర్తిస్తూ రాష్ట్రానికి చెందిన ఒకరిద్దరు సీనియర్ కాంగ్రెస్ నేతలకు తీసుకొంటారని చాలా జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఒక్కరిని కూడా తీసుకోలేదు. దానిలో ఉత్తరాది నేతలకే ఎక్కువ ప్రాధాన్యం లభించింది. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఎవరూ నోరుమెదపలేదు. కానీ అసంతృప్తి చెందడం సహజం. ఒకవేళ కొత్తగా ఏర్పాటు చేయబోయే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో కూడా తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలకు సముచిత స్థానం కల్పించకపోతే, రెండు రాష్ట్రాల పట్ల రాహుల్ గాంధీ వైఖరికి అది అద్దం పడుతుంది.  

రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత ఇవ్వాళ్ళ మొట్ట మొదటిసారిగా అధ్యక్ష హోదాలో స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. దీనికి మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, మాజీ కేంద్రమంత్రులు గులాం నబీ ఆజాద్, ఎకె అంటోనీ తదితరులు హాజరయ్యారు. 


Related Post