ఫ్లాష్ బ్యాక్ 2017 : స్టార్ సినిమా కాదు.. కంటెంట్ ఉన్న సినిమానే గెలిచింది..!

December 27, 2017


img

స్టార్ సినిమా.. తొలి సినిమా.. ప్రేమ కథ.. ఫ్యాక్షన్ స్టోరీ.. అసలు సినిమా హిట్ కు కథే అవసరమా.. అబ్బే కంటెంట్ లేని సినిమా అసలు వర్క్ అవుట్ అవుతుందా.. ఓ హిట్టు సినిమాకు అసలు సీక్రెట్ ఏంటి.. అసలు ఇంతకీ ఏంటి ఇదంతా అనుకుంటున్నారా.. వందల కొద్ది టెక్నిషియల్స్.. పదుల కొద్ది ఆర్టిస్టులు.. ఒక దర్శకుడు.. ఒక నిర్మాత.. కాస్టింగ్ ఇవన్ని కలిసి చేసేదే సినిమా.. 

ప్రతి సంవత్సరం వందల కొద్ది సినిమాలు రిలీజ్ అవుతుంటే.. వాటిలో సూపర్ హిట్ సినిమాలు ఎన్ని అంటే మాత్రం వేళ్లతో లెక్కపెట్టేలా ఉంటాయి. సినిమా హిట్ కు కథ కథనాలు ఎంత ముఖ్యమో టైమింగ్ కూడా అంతే ముఖ్యం. ఓ సినిమా కంటెంట్ సూపర్ అంటూ హిట్ కొడితే.. మరో సినిమా కథ ఎలా ఉన్నా కథనంతో ప్రేక్షకుల మెప్పు పొందుతారు. ఫైనల్ గా ఈ ఇయర్ స్టార్ సినిమాల సందడితో పాటుగా యువ హీరోల జోష్ కూడా బాగుంది. 

అంచనాలను అందుకున్న హిట్ సినిమాలు :

పదేళ్ల తర్వాత పంజా విసిరిన మెగాస్టార్ :


పదేళ్ల తర్వాత కూడా తన స్టామినా ఏంటి అన్నది ఖైది నంబర్ 150తో ప్రూవ్ చేసుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. తమిళ కత్తి సినిమా రీమేక్ గా వచ్చిన ఖైది నంబర్ 150 సినిమా వినాయక్ డైరక్షన్ లో వచ్చింది. ఈ సినిమాతో చరణ్ నిర్మాతగా మారి మొదటి సూపర్ హిట్ కొట్టాడు. అప్పటిదాకా ఉన్న నాన్ బాహుబలి రికార్డులన్ని ఖైది నంబర్ 150 చెరిపేశాడు.

100వ సినిమా గుర్తుండిపోయేలా :

నందమూరి నటసింహం బాలయ్య బాబు క్రిష్ డైరక్షన్ లో తన వందవ సినిమా ప్రత్యేకంగా ఉండాలని చేసిన సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి. 70 రోజుల్లో ఈ సినిమా పూర్తి చేసి బాలయ్య కెరియర్ లో శాతకర్ణి ప్రత్యేకమైన సినిమాగా నిలిచేలాచేశారు. 


ఇక శర్వానంద్ హీరోగా వచ్చిన శతమానం భవతి సినిమా కూడా ప్రత్యేకమైన సినిమా అని చెప్పొచ్చు. ప్రాంతీయ విభాగంలో ఈ సినిమా నేషనల్ అవార్డ్ సైతం సాధించింది. సతీష్ వేగేశ్న డైరక్షన్ లో వచ్చిన శతమానం భవతి సినిమా శర్వానంద్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా మంచి లాభాలు తెచ్చిపెట్టింది.

వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని నేను లోకల్ అంటూ వచ్చి ఖాతాలో మరో సూపర్ హిట్ వేసుకున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను నక్కిన త్రినాధరావు డైరెక్ట్ చేయగా దిల్ రాజు నిర్మించాడు. ఈ ఇయర్ స్పెషల్ మూవీగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సినిమా బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిన మూవీ అర్జున్ రెడ్డి.

విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ సినిమా సందీప్ వంగ డైరక్షన్ లో వచ్చింది. ఈ సినిమాలో విజయ్ నటనకు యూత్ లో స్టార్ ఫాలోయింగ్ వచ్చింది. షాలిని పాండే హీరోయిన్ గా నటించిన అర్జున్ రెడ్డి 4 కోట్లతో తీస్తే దాదాపు 40 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ ఇయర్ వరుణ్ తేజ్ కెరియర్ కు కమర్షియల్ హిట్ ఇచ్చింది ఫిదా మూవీ. శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వచ్చిన ఫిదా మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా ఈ ఒక్క సినిమాతో అమ్మడు ఓ రేంజ్ పాపులారిటీ తెచ్చుకుంది. ఇక భళ్లాలదేవ నటించిన ఘాజి సినిమా కూడా ఈ ఇయర్ సూపర్ హిట్ సినిమాల్లో స్థానం సంపాదించుకుంది. సంకల్ప్ రెడ్డి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.


ఇక ఈ ఇయర్ దర్శకధీరుడు రాజమౌళి అద్భుత కళాకండం బాహుబలి కన్ క్లూజన్ సినిమా కూడా ఎన్నో సంచలనాలు సృష్టించింది. దాదాపు 2000 కోట్ల గ్రాస్ కలక్షన్స్ ను వసూలు చేసిన మొదటి ఇండియన్ సినిమాగా తెలుగు సినిమా స్థాయిని పెంచింది బాహుబలి పార్ట్-2. రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపించగా.. ప్రభాస్, రానా, అనుష్కలు నేషనల్ స్టార్స్ గా ప్రమోట్ అయ్యారు.

హిట్ బొమ్మలు ఇవే :

ఈ ఇయర్ దసరాకి యంగ్ టైగర్ నటించిన జై లవ కుశ దుమ్ముదులిపేసింది. జై లవ కుశ మూడు పాత్రల్లో ఎన్.టి.ఆర్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. స్టార్ హీరోగా ఎన్.టి.ఆర్ క్రేజ్ అందరికి తెలిసిందే. అలాంటి తను రిస్క్ చేసి మరి చేసిన జై లవ కుశ మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. 


అదే దారిలో అల్లు అర్జున్ దువ్వాడ జగాన్నాథం కూడా హిట్ సినిమాల లిస్ట్ లో చేరింది. హరీష్ శంకర్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. నాని డిసెంబర్ లో వచ్చినా సరే హిట్ అందుకున్నాడు. ఎం.సి.ఏ అంటూ వచ్చిన నాని ఆ సినిమాతో మరోసారి తన సత్తా చాటాడు. 

ఇక తెలుగు తెర మీద త్రిల్లింగ్ కథలకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ఆడియెన్స్ ను భయపెడుతూ నవ్వించే సినిమాలు తెలుగులో బాగా సక్సెస్ అవుతాయి. ఈ ఇయర్ ఆనందో బ్రహ్మ అదే కోవలో వచ్చి హిట్ సాధించింది. మహి వి రాఘవ్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో తాప్సి లీడ్ రోల్ లో నటించగా శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిశోర్, తాగుబోతు రమేష్, షకలక శంకర్ నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఆనందో బ్రహ్మ అంచనాలను మించి వసూళ్లను రాబట్టి ఈ ఇయర్ హిట్ సినిమాల లిస్ట్ లో స్థానం సంపాదించుకుంది.


ఇక నిఖిల్ కేశవతో పాటుగా రాజ్ తరుణ్ కిట్టు ఉన్నాడు జాగ్రత్త, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలు హిట్ సాధించాయి. అఖిల్ హీరోగా వచ్చిన హలో సినిమా కూడా హిట్ కొట్టింది. శర్వానంద్ మహానుభావుడు కూడా హిట్ సినిమాల లిస్టులో స్థానం సంపాదించగా.. దగ్గుబాటి హీరోలు వెంకటేష్ గురు, రానా నేనే రాజు నేనే మంత్రి సినిమాలు హిట్ కొట్టాయి. ఇక రాజశేఖర్ సత్తా చాటేలా వచ్చిన పిఎస్వి గరుడవేగ హిట్ కొట్టా.. మాస్ మహరాజ్ రవితేజ రాజా ది గ్రేట్ కూడా హిట్ సినిమాల లిస్ట్ లో చేరింది.



Related Post