ఎయిర్ టెల్ స్మార్ట్ ఫోన్స్ విడుదల

November 16, 2017
img

జియో 4జి ఫీచర్ ఫోన్ కు పోటీగా భారతి ఎయిర్ టెల్ కూడా ఈరోజు 4జి స్మార్ట్ ఫోన్స్ రెండు మోడల్స్ మార్కెట్లోకి విడుదల చేసింది. వాటిలో ‘ఏ1 ఇండియన్’ మోడల్ ఫోన్ ఖరీదు రూ.4,390 కాగా, ఏ41 పవర్’ మోడల్ ఫోన్ ఖరీదు రూ.4,290. 

రెండు మోడల్స్ లో  నెలకు రూ.169 చొప్పున 18 నెలలు రీఛార్జ్ చేసుకొన్న తరువాత రూ.500, మళ్ళీ 18నెలల పాటు రీఛార్జ్ చేసుకొన్న తరువాత మరో రూ.1,500 వినియోగదారులకు వాపసు ఇవ్వబడుతుంది. అంటే అప్పుడు ఫోన్ ధర ఆ ఫోన్స్ రూ.1,849, రూ.1,799 లకే లభించినట్లవుతుంది. ఎయిర్ టెల్ నెట్ వర్క్ ను వాడుతున్న లేదా వాడదలచుకొన్న వినియోగదారులకు ఇది లాభకరమే. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ కార్బన్ ఈ స్మార్ట్ ఫోన్లను తయారుచేస్తోంది.

ఈ రెండు మోడల్స్ 4జి స్మార్ట్ ఫోన్స్ లో టచ్ స్క్రీన్ సైజ్: 4 అంగుళాలు, డ్యూయల్ సిమ్స్, ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం, గూగుల్ ప్లే స్టోర్, వాట్స్ ఆప్, ఫేస్ బుక్, యూ ట్యూబ్ వంటి యాప్స్ అన్నీ ఉన్నాయి.

‘ఏ1 ఇండియన్’ మోడల్:

ధర: రూ. 4,390, 1.1 గిగాహెడ్జ్‌ క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌, 1 జీబీ ర్యామ్‌, 8 జీబీ ఇంటర్నల్ మెమొరీ, బ్యాక్ కెమెరా: 3.2 పిక్సెల్‌, ఫ్రంట్ కెమెరా: 2 మెగా పిక్సెల్‌, బ్యాటరీ: 1500 ఎంఏహెచ్‌.

‘ఏ41 పవర్’ మోడల్: 

ధర: రూ.4,290, టచ్ స్క్రీన్ సైజ్: 4 అంగుళాలు, 1.3 గిగాహెడ్జ్‌ క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌, 1 జీబీ ర్యామ్‌, 8 జీబీ ఇంటర్నల్ మెమొరీ, బ్యాక్ కెమెరా: 2 పిక్సెల్‌, ఫ్రంట్ కెమెరా: 0.3 మెగా పిక్సెల్‌, బ్యాటరీ: 2,300 ఎంఏహెచ్‌.

Related Post