వీటిపై జి.ఎస్.టి. తగ్గింది

November 11, 2017
img

జి.ఎస్.టి.విధానం అమలులోకి వస్తే సామాన్యులపై భారం తగ్గుతుందని కేంద్రప్రభుత్వం పదేపదే చెప్పినప్పటికీ ఏ ఒక్క వస్తువు లేదా సేవల ధరలు తగ్గకపోగా జి.ఎస్.టి. పేరు చెప్పి వ్యాపారులు ప్రజలను దోచుకొంటున్నారు. ఆ కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనే సంగతి కేంద్రప్రభుత్వం గ్రహించడంతో మొన్న గౌహతిలో జరిగిన జి.ఎస్.టి. కౌన్సిల్ సమావేశంలో మరికొన్ని వస్తువులపై జి.ఎస్.టి. స్లాబులను తగ్గించారు. ముఖ్యంగా తెలంగాణా ప్రభుత్వం గ్రానైట్, పాలరాయి పరిశ్రమలపై జి.ఎస్.టి.ని మినహాయించాలని లేదా కనీసం భారం తగ్గించాలని గిట్టగా డిమాండ్ చేస్తోంది. దాని ఒత్తిడి మేరకు ఆ రెండింటిపై ప్రస్తుతం 28 శాతం ఉన్న జి.ఎస్.టి.ని 18 శాతానికి తగ్గించడం కొంత ఊరట కలిగించే విషయమే. వివిధ ఉత్పత్తులపై తగ్గించిన జి.ఎస్.టి. వివరాలు:      

5 నుంచి 0 శాతానికి జి.ఎస్.టి. తగ్గినవి: ముడి చమురు రిఫైనింగ్ తో వచ్చే ఫ్లై సల్ఫర్, ఫ్లై యాష్.

12 నుంచి 5 శాతానికి జి.ఎస్.టి.తగ్గినవి: కొబ్బరి చిప్పలు, చేపలు.

18 నుంచి 12 శాతానికి జి.ఎస్.టి.తగ్గినవి: డయాబెటిక్ ఫుడ్, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, కండెన్స్ మిల్క్‌, రిఫైండ్ షుగర్‌, పాస్టా కర్రీ పేస్ట్‌, హ్యాండ్‌ బ్యాగులు, హ్యాట్స్‌, కళ్ళ జోళ్ళ ఫ్రేములు, వెదురు, పుల్లలతో చేసిన ఫర్నీచర్, ప్రింటింగ్‌ ఇంక్. 

18 నుంచి 6 శాతానికి జి.ఎస్.టి.తగ్గినవి: ఇడ్లీ, దోశ పిండి, కొబ్బరి పొడి, చట్నీలకు ఉపయోగించే పిండి, గోరు చిక్కుడు గింజల పొడి, కొన్ని రకాల ఎండు కూరగాయలు, ఆటుకులతో చేసిన చిక్కీలు, బంగాళాదుంపల పిండి, చేపల వలలు, శుద్ధి చేసిన తోలు, పీచు.

28 నుంచి 18 శాతానికి జి.ఎస్.టి.తగ్గినవి: గ్రానైట్, పాలరాయి, శానిటరీవేర్, పాలిష్ లు, క్రీములు, స్టవ్ లు, కుక్కర్లు, స్టోరేజ్‌ వాటర్‌ హీటర్లు, ఫ్యాన్లు, రబ్బర్‌ ట్యూబులు, కట్‌లెరీ, ఫర్నీచర్, సూట్‌కేసులు, వాషింగ్ పౌడర్, డియోడరెంట్ లు, డిటర్జెంట్, రేజర్లు, బ్లేడ్లు, ఆఫ్టర్ షేవింగ్ క్రీములు, షాంపూలు, హెయిర్ క్రీములు, మేకప్ సామాగ్రి, హెయిర్‌ డైస్, రిస్ట్‌ వాచీలు, పరుపులు, వైర్లు, కేబుల్స్‌, బ్యాటరీలు, కూలింగ్ గ్లాసులు, చూయింగ్ గమ్, చాక్లెట్లు, కాఫీ, కస్టర్డ్‌ పౌడర్,  కృత్రిమ ఉన్ని, విగ్‌లు, లాంప్స్‌, మైక్రోస్కోపులు, డెంటల్ హైజీన్ ఉత్పత్తులు, తోలుతో చేసిన దుస్తులు. 

Related Post