ఎస్.బి.ఐ. ఖాదారులకు ముఖ్య సూచన

September 21, 2017
img

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్టేట్ బ్యాంక్ బ్రాంచీలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం అయినందున ఎస్.బి.ఐ.లో అనేక మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఎస్.బి.ఐ.లో విలీనమైన భారతీయ మహిళా బ్యాంకుతో సహా అన్ని శాఖల ఖాతాదారులకు ఈరోజు ఎస్.బి.ఐ. ఒక ముఖ్య సూచన చేసింది. ఎస్.బి.ఐ.ఖాతాదారులు అందరూ తమ వద్ద ఉన్న పాత చెక్ బుక్ లను ఈనెలాఖరులోగా ఎస్.బి.ఐ.లో జమాచేసి వాటి స్థానంలో కొత్త చెక్ బుక్స్ ను తీసుకోవాలని కోరింది. ఈ నెల 30వ తేదీ నుంచి ఆ పాస్ బుక్కులు చెల్లవని తెలియజేసింది. అలాగే అదేరోజు నుంచి ఆయా బ్రాంచీల ఐ.ఎఫ్.ఎస్.సి. కోడ్స్ కూడా మారబోతున్నాయని, ఖాతాదారులు అందరూ ఇకపై తమార్ధిక లావాదేవీల కోసం ఆ కొత్త ఐ.ఎఫ్.ఎస్.సి. కోడ్స్ నే వినియోగించవలసి ఉంటుందని తెలియజేసింది. కనుక చెక్ బుక్ లను వినియోగించే ఎస్.బి.ఐ. ఖాదారులు అందరూ వీలైనంత త్వరగా వాటిని మార్చుకోవడం మంచిది. 


Related Post