గూగుల్ తేజ్ యాప్ రెడీ

September 16, 2017
img

గూగుల్ ఇండియా కూడా సోమవారం నుంచి ఆన్-లైన్ నగదు బదిలీలు, పేమెంట్స్ రంగంలో ప్రవేశించబోతోంది. అందుకోసం అది రూపొందించిన దిజితాల్ పేమెంట్ యాప్ ‘తేజ్ ‘ ను కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ సోమవారం ప్రారంభించనున్నారు. నోట్లరద్దు తరువాత దేశంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి కేంద్రప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ నియంత్రణలో నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాను ప్రారంభించింది. అది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ విధానాన్ని అమలులోకి తీసుకురావడంతో వివిధ బ్యాంకులతో సహా పేటిఎం వంటి అనేక సంస్థలు కూడా ఈ రంగంలో ప్రవేశించాయి. ఇప్పుడు గూగుల్ కూడా ఈ రంగంలో ప్రవేశించడంతో బహుశః నగదురహిత లావాదేవీలు ఇంకా వేగం పుంజుకోవచ్చు.         


Related Post