యాపిల్ ఐ ఫోన్-8 ఇండియాకు వచ్చేస్తోంది

September 13, 2017
img

 ఒకప్పుడు ప్రముఖ మొబైల్ ఫోన్స్, కార్లు వగైరా తయారీ సంస్థలు తమ సరికొత్తరకం ఉత్పత్తులను అమెరికా, యూరోప్ వంటి అభివృద్ధి చెందిన దేశాలలో, ఆర్ధికంగా బలంగా ఉండే గల్ఫ్ దేశాలలోనే మొదట విడుదల చేసేవి. కానీ ప్రపంచంలోకే అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన భారత్ ను పట్టించుకోకపోవడం వలన తాము ఎంతగా నష్టపోతున్నామో గ్రహించిన తరువాత ఇప్పుడు దాదాపు అన్ని ప్రముఖ సంస్థలు అమెరికా, యూరప్ దేశాలతో బాటు భారత్ లో కూడా తమ ఉత్పత్తులను ఒకేసారి విడుదల చేస్తున్నాయి.

తాజా ఆపిల్ సంస్థ తన సరికొత్త మోడల్ ఐ ఫోన్-8, ఐ ఫోన్-8 ప్లస్ వెర్షన్స్ ను విడుదల చేసింది. వీటి బుకింగ్స్ ఈ నెల 15 నుంచి ప్రారంభం అవుతాయి. ఈనెల 29 నుంచి దేశంలో అన్ని ఆపిల్ షో రూమ్స్ లో లభిస్తాయి. భారత్ లో దాని ధర రూ.64,000.

ఈ రెండు మోడల్స్ ప్రత్యేకత ఏమిటంటే వైర్-లెస్ చార్జింగ్ చేసుకోవచ్చు. వీటి బ్యాక్ కవర్స్ పగిలిపోని అద్దంతో తయారుచేయబడ్డాయి. అత్యాధునిక క్యూ-ఐ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించబడిన ఈ అద్దం ద్వారానే ఈ ఫోన్లు ఛార్జింగ్ అవుతాయి. ఈ మోడల్స్ లో ఇంటర్నల్ స్టోరేజ్ కనిష్టంగా 64 జిబి కాగా గరిష్టంగా 256 జిబి ఉంటుంది. అవును మీరు విన్నది నిజమే! 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్! ఈ రెండు మోడల్స్ బంగారు, నలుపు మరియు సిల్వర్ కలర్స్ లో లభిస్తాయి. రెంటిలో యాపిల్ 3డి టచ్ సౌకర్యం ఉంది. రెంటిలో అత్యాధునికమైన ఏ-11 బయోనిక్ చిప్ సెట్ ను వినియోగించినందున ఫోన్ లో అన్ని ఫీచర్స్ అత్యంత వేగంగా పనిచేస్తాయి.

ఐ ఫోన్-8 ప్లస్ వివరాలు: దీని ధర: రూ. 77,000. ఈ మోడల్లోనే 64 జిబి ధర: రూ.64,000, 256 జిబి ధర: రూ. 86,000 ఉంటుంది. డిస్ ప్లే: 5.5 అంగుళాలు (ఎల్.సి.డి. రెటినా హెచ్.డి.క్వాలిటీ), ఫ్రంట్ అండ్ రియర్ కెమెరాలు: 12 మెగా పిక్సెల్స్.   

 ఐ ఫోన్-8 వివరాలు: దీని ధర: రూ.44,750. ఇంటర్నల్ మెమొరి: 64 జిబి డిస్ ప్లే: 4.7 అంగుళాలు, ఫ్రంట్ కెమెరా: 7, రియర్ కెమెరా: 12 మెగా పిక్సెల్స్.   

Related Post