హైదరాబాద్‌-చికాగో నాన్ స్టాప్ డైరెక్ట్ ఫ్లైట్

January 16, 2021
img

హైదరాబాద్‌ నుండి అమెరికా వెళ్లాలనుకొనేవారికి అలాగే అమెరికా నుండి హైదరాబాద్‌ రావాలనుకొనేవారికి చాలా అంతర్జాతీయ విమానాలు అందుబాటులో ఉన్నాయి. కానీ అవేవీ నేరుగా రావు. మద్యలో రెండుమూడు దేశాలలో ఆగుతుంటాయి. దాని వలన ప్రయాణసమయం మరింత పెరుగుతుంది. కనుక ఎయిర్ ఇండియా సంస్థ చికాగో-హైదరాబాద్‌-చికాగో మద్య నాన్-స్టాప్ డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులను ప్రారంభించింది. చికాగో నుండి సుమారు 16 గంటల 45 నిమిషాలు ఏకధాటిగా ప్రయాణించి ఎయిర్ ఇండియా విమానం శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్‌ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకొంది. ఈ విమానంలో మొత్తం 238 సీట్లు ఉంటాయి. వాటిలో 195 ఎకానమీ క్లాస్, 35 బిజినెస్ క్లాస్, 8 ఫస్ట్ క్లాస్ ఉంటాయి. నలుగురు పైలట్లు, 12 మంది క్యాబిన్ సిబ్బంది ఉంటారు. 

ప్రస్తుతం వారానికి ఒక రోజు మాత్రమే చికాగో-హైదరాబాద్‌-చికాగో మద్య నాన్-స్టాప్ డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులను నడిపించాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. 

హైదరాబాద్‌ నుండి ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు ఫ్లైట్ నెంబర్ ఏఐ-107 బయలుదేరి అమెరికా కాలమాన ప్రకారం ఆదేరోజు సాయంత్రం 18.05 గంటలకు చికాగోకు చేరుకొంటుంది. ప్రయాణ సమయం సుమారు 16 గంటల 45 నిమిషాలు ఉంటుంది. 

అదేవిదంగా చికాగో నుండి ప్రతీ బుదవారం అమెరికా కాలమాన ప్రకారం రాత్రి 9.30 గంటలకు ఫ్లైట్ నెంబర్ ఏఐ-108 బయలుదేరి భారత్‌ కాలమాన ప్రకారం రాత్రి 12.40 గంటలకు హైదరాబాద్‌ చేరుకొంటుంది. ప్రయాణ సమయం సుమారు 15 గంటల 40 నిమిషాలు ఉంటుంది. 

Related Post