బహిరంగ మార్కెట్‌లో కొవీషీల్డ్ ధర రూ.1,000: పూనావాలా

January 13, 2021
img

హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్ కంపెనీ తయారుచేసిన కోవ్యాక్సిన్ 54. 72 లక్షల డోసులు దేశవ్యాప్తంగా వివిద రాష్ట్రాలకు మంగళవారం చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. భారత్ బయోటెక్ అభివృద్ధి కోవక్సిన్ ధరను రూ.206 రూపాయలుగా నిర్ణయించామని కేంద్రఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. సుమారు పది కోట్ల వ్యాక్సిన్లు కొనుగోలు చేయనున్నామని తెలిపారు. 

ఇది ఇలా ఉండగా...పూణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా కంపెనీ కోవిషీల్డ్ పేరుతో ఉత్పత్తి చేస్తున్న కరోనా టీకాలు కూడా నిన్న అన్ని రాష్ట్రాలకు పంపిణీ పూర్తయిందని ఆ సంస్థ సీఈవో ఆధర్ పునవాలా మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా అదర్ పునవాలా మాట్లాడుతూ కోవి షీల్డ్ 200 రూపాయలుగా నిర్ణయించినట్లు తెలిపారు. అయితే ఈ ధర ప్రభుత్వానికి సరఫరా చేస్తున్న 10 కోట్లు డోసులుకు మాత్రమే వర్తిస్తుందని, ఇది బహిరంగ మార్కెట్‌లో రూ. 1,000కి అందిస్తామని ఆధర్ పూనావాలా తెలిపారు. దేశంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని కోవిషిల్డ్ ధరను రూ.1,000 రూపాయలుగా నిర్ణయించామని  తెలిపారు. 

Related Post