సచివాలయం నిర్ణాణపనులు ఆ కంపెనీకే

October 29, 2020
img

తెలంగాణ నూతన సచివాలయ భవన నిర్మాణ కాంట్రాక్ట్ ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్‌జీ పలోమ్‌జీ సంస్థ దక్కించుకొంది. ఈ పనికోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.494 కోట్లు అంచనా వ్యయం ప్రకటించింది. ఈ కాంట్రాక్ట్ దక్కించుకొనేందుకు పోటీ పడిన ఎల్&టి దానిపై 4.8 శాతం అధికంగా కోట్ చేయగా షాపూర్‌జీ పలోమ్‌జీ సంస్థ 4 శాతం అధికంగా కోట్ చేయడంతో ఈ కాంట్రాక్ట్ దాంకే దక్కింది. కనుక ఈ కాంట్రాక్టును షాపూర్‌జీ పలోమ్‌జీ సంస్థకు అప్పగిస్తున్నట్లు కమీషనర్ ఆఫ్ టెండర్స్ ప్రకటించి అంగీకారపత్రం కూడా అందజేసారు. గత ఏడాది జూన్‌కు 29న సిఎం కేసీఆర్‌ కొత్తగా నిర్మించబోయే సచివాలయానికి శంఖుస్థాపన చేశారు. ఏడున్నర లక్షల చదరపు అడుగులలో  ఏడంతుస్తుల భవనానికి డ్రాయింగ్‌ను కూడా ఖరారు చేశారు. నేటి నుంచి ఏడాదిలోపుగా నూతన సచివాలయం నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం ముందే షరతు విధించింది. నిర్మాణపనులు మొదలుపెట్టేందుకు ప్రస్తుతం మంచి ముహూర్తాలు కూడా ఉన్నాయి కనుక వీలైనంత తొందర్లోనే నూతన సచివాలయ నిర్మాణపనులు మొదలుపెట్టే అవకాశం ఉంది.         


Related Post