ప్యాసింజర్ పాయే... ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాలే

October 21, 2020
img

దేశంలోని సామాన్యుల రైళ్ళు...ప్యాసింజర్ రైళ్ళు. వాటిని రైల్వేశాఖ గుట్టుచప్పుడు కాకుండా ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళుగా మార్చేసింది. ఒకటీ రెండూ కాదు ఏకంగా 362 ప్యాసింజర్ రైళ్ళను ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళుగా మార్చేసింది. కనుక ప్రజలు ఇప్పుడు అవే గమ్యస్థానాలు చేరుకొనేందుకు దాదాపు రెండు మూడు రెట్లు చెల్లించి టికెట్ కొనుగోలుచేయవలసి ఉంటుంది. ప్రయాణికులు  మరింత త్వరితంగా తమ గమ్యస్థానాలు చేరడం కోసమే ఈ మార్పు అని రైల్వేశాఖ కుంటిసాకు చెప్పినప్పటికీ అసలు కారణం రాబడిలేని ప్యాసింజర్ రైళ్ళను ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళుగా తిప్పి ఆదాయం పెంచుకోవడం కోసమేనని అర్ధమవుతోంది. ఈవిధంగా ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళుగా మార్చినవాటిలో 43 రైళ్ళు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో తిరిగుతున్నాయి. ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళుగా మారిన ప్యాసింజర్ రైళ్ళు:

• సికింద్రాబాద్‌-మణుగూరు-సికింద్రాబాద్‌

• సికింద్రాబాద్‌-రేపల్లె-సికింద్రాబాద్‌

• హైదరాబాద్‌-విజయపుర-హైదరాబాద్‌

• హైదరాబాద్‌ -పర్బని-హైదరాబాద్‌ 

• కాచిగూడ-గుంటూరు-కాచిగూడ 

• కాచిగూడ-రాయచూరు-కాచిగూడ

•  కాకిగూడ-నాగర్ సోల్-కాచిగూడ 

• కాచిగూడ-కర్నూల్ సిటీ-కాచిగూడ,

• కాజీపేట-బలార్షా-కాజీపేట

• కాజీపట-అల్నా-కాజీపేట

• భద్రాచలం రోడ్-బళ్లార్షా-భద్రాచలం రోడ్

• బొల్లారం-విజయపుర-బొల్లారం         


Related Post