సింగరేణి కార్మికులకు శుభవార్త

October 15, 2020
img

సింగరేణి కార్మికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆ శుభవార్తను ఆ సంస్థ సీఎండీ శ్రీధర్ మంగళవారం ప్రకటించారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో సింగరేణి కార్మికులకు లాభాలలో 28 శాతం వాటాను బోనస్‌గా చెల్లించబోతున్నట్లు ప్రకటించారు. ఒక్కో కార్మికుడికి సుమారు రూ.60,468 బోనస్‌ అందుకోబోతున్నారని చెప్పారు. ఈనెల 19న వారి బ్యాంక్ ఖాతాలలో ఆ బోనస్ సొమ్మును జమా చేస్తామని చెప్పారు. ఈ ఏడాది (2019-2020)లో సింగరేణికి రూ.993.86 కోట్లు లాభం వచ్చిందని, దానిలో 28 శాతం అంటే రూ. 278.28 కోట్లు కార్మికులకు బోనస్‌గా చెల్లించబోతున్నట్లు శ్రీధర్ తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా ఈ ఏడాది మార్చి నెలలో కార్మికుల జీతాలలో కోసిన మొత్తాన్ని కూడా బోనస్‌తో కలిపి చెల్లించబోతున్నామని తెలిపారు. ఈ ఏడాది కూడా దసరా పండుగ అడ్వాన్స్ ఒక్కో కార్మికుడికి రూ.25,000 చొప్పున 19వ తేదీన బ్యాంక్ ఖాతాలలో జమా చేస్తామని సింగరేణి సీఎండీ శ్రీధర్ చెప్పారు.          

కరోనా... లాక్‌డౌన్‌ కారణంగా కంపెనీ ఆర్ధిక పరిస్థితులు కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కార్మికులపై అపారమైన  ప్రేమాభిమానాలు కలిగిన సిఎం కేసీఆర్‌ ఈ ఏడాది 28 శాతం బోనస్ చెల్లించాలని ఆదేశించారని చెప్పారు. సిఎం కేసీఆర్‌ ఆదేశానుసారం కార్మికుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని 28 శాతం బోనస్ చెల్లిస్తున్నామని సింగరేణి సీఎండీ శ్రీధర్ చెప్పారు.

Related Post