భారతీయ బాషలలో అమెజాన్ సేవలు లభ్యం

September 23, 2020
img

కోట్లాది మంది భారతీయులను ఆకట్టుకొని తమ ఉత్పత్తులను అమ్ముకొని లాభాలు గడించాలంటే వారి మాతృబాషలోనే సేవలు అందించడం చాలా ముఖ్యమని గ్రహించిన చాలా సంస్థలు ఇప్పటికే భారతీయ బాషలలో తమ సేవలు, ఉత్పత్తులను అందిస్తున్నాయి. ఆ జాబితాలో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్.ఇన్ కూడా చేరిపోయింది. 

ఇప్పటికే ఆన్‌లైన్‌ షాపింగ్‌లో హిందీలో సేవలందిస్తున్న అమెజాన్.ఇన్ ఇప్పుడు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం బాషలలోనూ సేవలను ప్రారంభించింది. అమెజాన్.ఇన్ వెబ్‌సైట్‌లో ‘సెర్చ్ కాలం’ పక్కన ఉండే త్రివర్ణపతాకంపై క్లిక్ చేస్తే పాప్-అప్‌ బాక్సు వస్తుంది. దానిలో మనకు నచ్చిన బాషను ఎంచుకొన్నాక ‘సేవ్ సెటింగ్స్’ బటన్ నొక్కితే చాలు. ఇకపై అమెజాన్.ఇన్ వెబ్‌సైట్‌లో ఉత్పత్తులు, సేవల వివరాలన్నీ మనం ఎంచుకొన్న బాషలోనే కనబడుతుంటాయి. వినియోగదారులు ఎంచుకొన్న బాషతో పాటు హిందీ, ఇంగ్లీష్ బాషలలో కూడా అమెజాన్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్ తో  మాట్లాడవచ్చని అమెజాన్‌ కస్టమర్‌ ఎక్స్‌పీరియెన్స్ మరియు మార్కెటింగ్‌ డైరెక్టర్‌ కిశోర్‌ తోట చెప్పారు. ఈ ఏడాది దసరా, దీపావళి పండుగల సీజన్‌లో సుమారు 20-30 కోట్ల మంది వినియోగదారులను ఆకర్షించి సేల్స్ పెంచుకోవాలనే లక్ష్యంతో భారతీయబాషలను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు.

Related Post