ఎల్ఆర్ఎస్ ఛార్జీలను సవరించిన ప్రభుత్వం

September 18, 2020
img

శాసనసభలో ప్రతిపక్షాల సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం భూ క్రమబద్దీకరణ పధకం (లాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్-ఎల్ఆర్ఎస్) ఛార్జీలను సవరిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ ధర ప్రకారం ఎల్ఆర్ఎస్ ఛార్జీలను వసూలు చేయాలని ప్రభుత్వం భావించగా దాని వలన సామాన్యప్రజలు, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలపై చాలా భారం పడుతుందని కనుక రిజిస్ట్రేషన్ సమయంలో ఉన్న మార్కెట్ విలువ ఆధారంగానే ఎల్ఆర్ఎస్ ఫీజు ఉండాలని ప్రతిపక్షాల సూచనపై మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ సానుకూలంగా స్పందించారు. వారు సూచించిన విధంగానే గతంలో జారీ చేసిన జీవో నెం:131ను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

పాత జీవో ప్రకారం ఎల్ఆర్ఎస్ ఛార్జీలు

సవరించిన జీఓ ప్రకారం ఎల్ఆర్ఎస్ ఛార్జీలు

చదరపు గజానికి మార్కెట్ విలువ రూ.లో

క్రమబద్దీకరణ ఛార్జీలు

చదరపు గజానికి మార్కెట్ విలువ రూ.లో

క్రమబద్దీకరణ ఛార్జీలు

3,000 లోపు

25%

3,000లోపు

20%

3001-5000

50%

3,001-5,000

30%

5001-10,000

75%

5,001-10,000

40%

10,001కి పైన

100%

10,001-20,000

50%

 

 

20,001-30,000

60%

 

 

30,001-50,000

80%

 

 

50,000పైన

100%

Related Post