చైనాకు షాక్ ఇచ్చిన మన హీరో

July 08, 2020
img

చైనా పట్ల దేశంలో సర్వత్రా వ్యతిరేకత ఎదురవుతోంది. ఇప్పటికే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు గతంలో చైనాతో చేసుకొన్న పలు ఒప్పందాలను రద్దు చేసుకొంటుండగా దేశంలో ప్రైవేట్ సంస్థలు కూడా తమను దారుణంగా దెబ్బ తీస్తున్న చైనాపై ప్రతీకారం తీర్చుకొంటున్నాయి. దేశంలో అత్యంత ప్రజాధారణ పొందిన హీరో సైకిల్స్ కూడా వాటిలో ఒకటి. గతంలో ఆ సంస్థ ఓ చైనా సంస్థతో రూ.900 కోట్లు విలువ చేసే ఓ ఒప్పందం చేసుకొంది. ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకొంటున్నట్లు హీరో సైకిల్స్ అధినేత పంకజ్ ముంజల్ ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా హీరో సైకిల్స్ సంస్థను నూటికి నూరుశాతం దేశీయసంస్థగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. భారతీయులందరూ కూడా చైనా ఉత్పత్తులను బహిష్కరించి, స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలుచేసినట్లయితే ఆయా సంస్థలకు...వాటిలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు అందరికీ మేలు కలుగుతుందని, దేశ ఆర్ధికవ్యవస్థ కూడా బలపడుతుందని పంకజ్ ముంజల్ అన్నారు. భారత్‌లో 72 శాతం మార్కెట్ వాటా ఉన్న తాము అవలీలగా ఈ లక్ష్యం సాధించగలమని పంకజ్ ముంజల్ చెప్పారు. త్వరలోనే మోటారుతో నడిచే తేలికపాటి హీరో ఎలక్ట్రో ఈ-సైకిలును మార్కెట్లోకి విడుదల చేయబోతున్నామని తెలిపారు. 

Related Post