నేటి నుంచి రైల్వే టికెట్ కౌంటర్లు కూడా ప్రారంభం

May 22, 2020
img

జూన్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభం కాబోతున్న 15 జతల ప్రత్యేక రైళ్ళకు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే టికెట్లు తీసుకోవాలనే షరతును రైల్వేశాఖ గురువారం ఎత్తివేసింది. నేటి నుంచి దేశవ్యాప్తంగా ఎంపికచేసిన రైల్వేస్టేషన్‌లలో రిజర్వేషన్ టికెట్ బుకింగ్ కౌంటర్లను తెరవాలని నిర్ణయించింది. వాటిలో మిగిలిన 85 జతల సాధారణ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళకు టికెట్లు లభించవు. టికెట్ బుకింగ్ కౌంటర్లతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న 1.7 లక్షల ఉమ్మడి సేవా కేంద్రాలను, టికెట్ ఏజంట్లను కూడా ప్రయాణికుల తరపున టికెట్స్ బుకింగ్‌ చేయడానికి   అనుమతించాలని నిర్ణయించింది. 

తెలంగాణలో టికెట్ బుకింగ్ కౌంటర్లు తెరుచుకోబోయే రైల్వేస్టేషన్లు: 

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, కాచిగూడ, ఖమ్మం, కాజీపేట, నల్గొండ, సిర్పూర్ కాగజ్ నగర్, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, మహబూబాబాద్, తాండూర్, వికారాబాద్, మంచిర్యాల, మిర్యాలగూడ, రామన్న పేట, పెద్దపల్లి, కామారెడ్డి, కృష్ణా.       

ఏపీలో టికెట్ బుకింగ్ కౌంటర్లు తెరుచుకోబోయే రైల్వేస్టేషన్లు: 

తిరుపతి, రేణిగుంట, చిత్తూరు, కోడూరు, నెల్లూరు, గూడూరు, అధోని, కర్నూలు, మంత్రాలయం రోడ్, అనంతపురం, ధర్మావరం, ఒంగోలు, ఓబుళావారిపల్లె, రాజంపేట, పుల్లంపేట, నందలూరు, కడప, కమలాపురం, యర్రగుంట్ల, ముద్దనూరు, కొండాపురం, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, పిడుగురాళ్ళ, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, ఏలూరు, నిడదవోలు, అనపర్తి, పిఠాపురం, రాజమండ్రి, సామర్లకోట, తాడేపల్లిగూడెం, అన్నావరం, తుని, నర్సీపట్నం రోడ్, యలమంచిలి, అనకాపల్లి, రాయనపాడు రైల్వేస్టేషన్‌లతో పాటు వాటి దక్షిణమద్య రైల్వే పరిధిలో గల మహారాష్ట్రలోని 6, కర్ణాటక 5 రైల్వేస్టేషన్‌లలో కూడా బుకింగ్ కౌంటర్లు తెరుస్తారని వాటిలో కేవలం 15 జతల ప్రత్యేక రైళ్ళలో టికెట్లు మాత్రమే లభిస్తాయని దక్షిణమద్య రైల్వే తెలియజేసింది. 

Related Post