జిఎస్టీ వసూళ్ళలో తెలంగాణ సూపర్!

February 18, 2020
img

తెలంగాణ రాష్ట్రం జూన్2, 2014లో ఆవిర్భవించింది. అంటే రాష్ట్రం ఆవిర్భవించి కేవలం ఐదున్నర సం.లు మాత్రమే అయ్యిందన్నమాట! కానీ ఈ స్వల్ప వ్యవధిలోనే దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీపడే స్థాయికి ఎదిగిందంటే ఆ క్రెడిట్ సిఎం కేసీఆర్‌కు ఆయన ప్రభుత్వానికే దక్కుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న నూతన విధానాలు, సంస్కరణల వలన రాష్ట్రంలో వాణిజ్యసంస్థలు, ఐ‌టి కంపెనీలు, ప్రైవేట్ పరిశ్రమలు బాగా పెరిగాయి. వాటిలో అనేక అంతర్జాతీయ సంస్థలు కూడా ఉన్నాయి. వాటితో ప్రజల జీవన ప్రమాణాలు...కొనుగోలు శక్తి కూడా పెరిగింది. ఇదే సమయంలో కేంద్రప్రభుత్వం జీఎస్టీని అమలులోకి తీసుకురావడంతో దేశవ్యాప్తంగా జీఎస్టీ పన్నుల రాబడి క్రమంగా పెరుగుతోంది. జీఎస్టీ పన్నుల వసూళ్ళలో దేశంలో మొదటిస్థానంలో పంజాబ్, తరువాత స్థానాలలో వరుసగా గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలు నిలిచాయి. పంజాబ్‌లో 22 శాతం వసూళ్లు పేరుగగా, గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలు 19 శాతం, కేరళలో 17 శాతం  పెరిగాయి. 

గత ఆర్ధిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో మార్చి 31వతేదీకి జీఎస్టీ ద్వారా రూ.28,786.44 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ సం.లో సుమారు రూ.31,186.67 కోట్లు ఆదాయం వస్తుందని జీఎస్టీ అధికారులు అంచనావేస్తున్నారు. ఇప్పటివరకు దానిలో 77.3 శాతం ఆదాయం వచ్చింది కనుక మార్చి 31లోగా మరో రూ.6,000 కోట్లు అంతకు మించి ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2019-20 ఆర్ధిక సం.లో వసూలైన జీఎస్టీ ఆదాయం వివరాలు: 

ఏప్రిల్-2019

1,573.95 కోట్లు

 మే

1,364.47 కోట్లు

జూన్

3,387.93 కోట్లు

జూలై

1,884.79 కోట్లు

ఆగస్ట్

3,427.88 కోట్లు

సెప్టెంబర్

1,186.26 కోట్లు

అక్టోబర్

1,271.98 కోట్లు

నవంబర్

4,121.21 కోట్లు

డిసెంబర్

2,129.83 కోట్లు

జనవరి-2020

3,787.00 కోట్లు

మొత్తం

24,135.30 కోట్లు

Related Post