తొలిరోజే మెట్రోలో 33,886 మంది ప్రయాణం

February 12, 2020
img

ఈ నెల 7వ తేదీన ఎంజీబీఎస్-జెబిఎస్ కారిడార్‌లో మెట్రో రైల్‌ సర్వీసులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ లాంఛనంగా ప్రారంభించగా మరుసటిరోజు ఉదయం నుంచి మెట్రో సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మొదటిరోజు నుంచే ప్రయాణికుల రద్దీ మొదలైంది. సోమవారం ఒక్కరోజే ఆ మార్గంలో మొత్తం 33,886 మంది ప్రయాణించారని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. వారిలో ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి 14,894 మంది ప్రయాణించారని తెలిపారు. 

ఎల్బీ నగర్-మియాపూర్, నాగోల్-ఉప్పల్, ఎంజీబీఎస్-జెబిఎస్ మూడు మార్గాలలో సోమవారం 4.47 లక్షలమంది ప్రయాణించారని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. 

నగరంలో అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ నుంచి రోజుకు 25,779 మంది ప్రయాణిస్తుండగా, ఎల్బీ నగర్ స్టేషన్ నుంచి 24,181 మంది, రాయదుర్గం-21,957, మియాపూర్-19,425, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు స్టేషన్-16,677, సికింద్రాబాద్‌-15,294, జెబిఎస్ స్టేషన్-14,894, హైటెక్ సిటీ స్టేషన్-13,568, జేఎన్టీయూ స్టేషన్-13,513 మంది రోజూ ప్రయాణిస్తున్నారని తెలిపారు. ఎంజీబీఎస్-జెబిఎస్ కారిడార్‌లో కూడా మెట్రో సేవలు ప్రారంభం అయినందున రానున్న రోజులలో మెట్రోలో ప్రయాణించేవారి సంఖ్య మరింతగా పెరగవచ్చని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

Related Post