సుందర్ పిచాయ్‌కు అదనపు బాధ్యతలు

December 04, 2019
img

గూగుల్ సీఈఓ పిచాయ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించబడ్డాయి. గూగుల్ మాతృసంస్థ ‘ఆల్ఫాబెట్’ కు కూడా సీఈఓ పిచాయ్‌ అదనపు బాధ్యతలు చేపట్టారు. ఆల్ఫాబెట్ వ్యవస్థాపకులైన లారీ పేజ్, సెర్జీ బ్రెన్ గత 21 సం.లుగా ఆ సంస్థను నడిపిస్తున్నారు. కనుక వాటి బాధ్యతల నుంచి తప్పుకొని విశ్రాంతి తీసుకోవాలని ఇద్దరూ నిర్ణయించడంతో ఆ బాధ్యతలను సుందర్ పిచాయ్‌కు అప్పగించారు. తాము సంస్థ రోజువారీ కార్యక్రమాల నుంచి తప్పుకొన్నప్పటికీ అవసరమైనప్పుడు సంస్థకు సలహాలు, సూచనలు ఇస్తామని లారీ పేజ్, సెర్జీ బ్రెన్ చెప్పారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గూగుల్ అత్యంత ప్రజధారణ కలిగి ఉంది. దానికి ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తూ మరింత అభివృద్ధి చేసి గూగుల్ లాభాలను మరింత పెంచడానికి సుందర్ పిచాయ్ కృషి చేయనున్నారు. 


Related Post