నేటి అర్దరాత్రి నుంచి ఆర్టీసీ ఛార్జీలు పెంపు

December 02, 2019
img

తెలంగాణ రాష్ట్రంలో నేటి అర్దరాత్రి నుంచి ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరగనున్నాయి. గ్రామీణ ప్రజలు ఎక్కువగా వినియోగించుకొనే పల్లె వెలుగు బస్సులకు కనీస ఛార్జీ రూ.5 నుంచి రూ.10కు పెరుగనుంది. సామాన్య ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణించే సెమీ ఎక్స్‌ప్రెస్‌ కనీస ఛార్జీ రూ.10, ఎక్స్‌ప్రెస్‌ కనీస ఛార్జీ రూ.10 నుంచి రూ.15కు పెరుగనుంది. 

దూరప్రాంతాలకు తిరిగే డీలక్స్ బస్సులకు కనీస ఛార్జీ రూ.10 నుంచి రూ.20కు పెరుగనుంది. సూపర్ లగ్జరీ బస్సుల కనీస ఛార్జీ రూ.25గా నిర్ణయించారు. 

రాజధాని, వజ్ర, గరుడ ఏసీ, గరుడ ప్లస్ ఏసీ బస్సుల కనీస ఛార్జీ రూ.35, వెన్నెల స్లీపర్ క్లాస్ కనీస ఛార్జీ రూ.70 గా నిర్ణయించారు. 

కిలో మీటర్ల లెక్కనైతే... 

పల్లెవెలుగుకు ఒక కిలో మీటరుకు 83 పైసలు, సెమీ ఎక్స్‌ ప్రెస్‌ - 95 పైసలు, ఎక్స్‌ప్రెస్‌- రూ.1.07, డీలక్స్- రూ. 1.18, సూపర్ లగ్జరీ-1.36, రాజధాని ఏసీ, వజ్ర బస్సులకు రూ.1.66, గరుడ ఏసీ-రూ.1.91, గరుడ ఏసీ ప్లస్-రూ.202 చొప్పున ఉంటుంది.

Related Post