హైటెక్‌సిటీ-రాయదుర్గం మెట్రో సర్వీసులు ప్రారంభం

November 29, 2019
img

హైదరాబాద్‌ మెట్రో నానాటికీ నగరం నలువైపులా విస్తరిస్తోంది. ఈరోజు ఉదయం హైటెక్‌సిటీ-రాయదుర్గం మెట్రో సర్వీసులను హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్లో మంత్రి కేటీఆర్‌ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎల్&టి సంస్థ, హైదరాబాద్‌ మెట్రో సంస్థ, ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు. అనంతరం వారందరూ మెట్రోలో మైండ్ స్పేస్ స్టేషన్ వరకు ప్రయాణించారు. రాయదుర్గం వరకు మెట్రో సేవలు అందుబాటులోకి రావడంతో ఫేజ్-2, రహేజా, ఇనార్బిట్ మాల్ రోడ్డులో ఉన్న ఐ‌టి కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగులకు చాలా సౌకర్యంగా ఉంటుంది. వచ్చే నెలాఖరులోగా జెబిఎస్- ఎంజీబీఎస్‌ మద్య కూడా మెట్రో సర్వీసులు ప్రారంభం కానున్నాయి. నగరంలో నానాటికీ ట్రాఫిక్ పెరిగిపోతుండటం, అదే సమయంలో నగరం నలుమూలలకు మెట్రో విస్తరిస్తుండటంతో మెట్రోలో ప్రయాణించేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రెండు నెలల క్రితం రోజుకు సుమారు 3 లక్షల మంది ప్రయాణించేవారు. ఇప్పుడు వారి సంఖ్య 4 లక్షలకు చేరుకొంటోంది. 


Related Post