హైదరాబాద్‌ మెట్రో తాజా సమాచారం

November 18, 2019
img

హైదరాబాద్‌ మెట్రో కారిడార్-2లో భాగంగా జూబ్లీ బస్‌ స్టేషన్ (జెబిఎస్) నుంచి పాతబస్తీ మీదుగా ఫలక్‌నుమా వరకు 15కిమీ మేర మెట్రో లైన్‌ నిర్మించవలసి ఉంది. కానీ పాతబస్తీలో చారిత్రక కట్టడాలున్నందున అభ్యంతరాలు వ్యక్తం అవడంతో ఆ ప్రాంతంలో 6 కిమీ మేర పనులు నిలిపివేసి, మిగిలిన 9కిమీ మార్గంలో జూబ్లీ బస్‌ స్టేషన్ నుంచి మహాత్మాగాంధీ బస్‌ స్టేషన్ (ఎంజిబిఎస్) వరకు ఎల్&టి సంస్థ శరవేగంగా నిర్మాణ పనులు పూర్తిచేస్తోంది. త్వరలోనే ఆ పనులు పూర్తికానున్నాయి. 

ఈ మెట్రో మార్గం కూడా నగర ప్రజలకు అందుబాటులోకి వచ్చినట్లయితే హైదరాబాద్‌లో మొత్తం 66 కిమీ మెట్రో విస్తరించినట్లవుతుంది. ప్రస్తుతం ఈ 9కిమీ మార్గంలో సిగ్నలింగ్, విద్యుదీకరణ, టెలీకమ్యూనికేషన్ వ్యవస్థల ఏర్పాటయ్యాయి. త్వరలోనే ట్రయల్ రన్స్ ప్రారంభించి డిసెంబర్ నెలాఖరులోగా ఈ మార్గంలో సర్వీసులను ప్రారంభిస్తామని మెట్రో అధికారులు చెప్పారు.  

ఈ 9కిమీ మార్గంలో జెబిఎస్, పాత గాంధీ ఆసుపత్రి, కొత్త గాంధీ ఆసుపత్రి, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, కోఠి వద్ద మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే నగరం నలువైపులకు మెట్రో విస్తరించినట్లవుతుంది. 

Related Post