హైటెక్‌సిటీలో స్కైవే ప్రారంభం

October 14, 2019
img

హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్‌ను పక్కనే ఉన్న మెట్రోమాల్‌తో అనుసంధానం చేస్తూ నిర్మించిన స్కైవేకు ఆదివారం ప్రారంభోత్సవం జరిగింది. కనుక మెట్రోమాల్‌ నుంచి హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్‌కు వెళ్ళేవారికి అలాగే హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్‌ నుంచి మెట్రోమాల్‌లో షాపింగ్ చేసుకొనేవారికి బయటకు వచ్చి రోడ్డు క్రాస్ చేయనవసరం లేకుండా నేరుగా చేరుకోవచ్చు. హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్‌ వద్ద తగుయినంత స్థలం లేకపోవడంతో మెట్రోమాల్‌లో పార్కింగ్ ఏర్పాటుచేశారు. కనుక వాహనదారులకు కూడా కొత్తగా ప్రారంభించిన ఈ స్కైవే చాలా సౌకర్యంగా ఉంటుంది. పంజగుట్ట మెట్రో స్టేషన్‌ పక్కనే నిర్మించిన ‘మెట్రోమాల్‌ గెలెరియా’ను కూడా ఇదేవిధంగా స్కైవేతో అనుసంధానించారు. 


Related Post