ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త!

October 07, 2019
img

ఎస్‌బీఐ నుంచి ఎప్పుడూ ఏదో వడ్డింపులే తప్ప శుభవార్తలు ఏముంటాయనుకోవద్దు. దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఎస్‌బీఐ తన ఖాతాదారులకు ఒక శుభవార్త ప్రకటించింది. ఇప్పటికే చాలా మంది ఎస్‌బీఐ డెబిట్ (ఏటిఎం) కార్డులను ఉపయోగించి నగదురహిత లావాదేవీలు చేస్తున్నారు. అయితే వస్తువు ఖరీదు ఎంతుంటే అంతా ఒకేసారి చెల్లించలసి వస్తోంది. చిన్న చిన్న చెల్లింపులకు పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు కానీ ఏవైనా ఖరీదైన వస్తువులను వాయిదా పద్దతిలో కొనాలనుకుంటే క్రెడిట్ కార్డు లేదా బజాజ్ ఫిన్ సర్వ్ వంటి కార్డులను తీసుకోవలసివస్తోంది. 

ఇది గమనించిన ఎస్‌బీఐ ఇకపై దేశవ్యాప్తంగా గల సుమారు 40,000 వివిద వ్యాపారసంస్థలు అమ్ముతున్న వివిదరకల వస్తువులను డెబిట్ కార్డు ఉపయోగించి కొనుగోలు చేసి 6 నుంచి గరిష్టంగా 18 వాయిదాల పద్దతిలో చెల్లింపులు చేయవచ్చు. దీనికోసం ఎస్‌బీఐ ఖాతాదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి 567676 నెంబరుకు ‘డిసిఈఎంఐ’ అనే మెసేజ్ పంపించినట్లయితే ఇందుకు అర్హులో కారో తెలియజేస్తూ మళ్ళీ జవాబు వస్తుంది. అర్హులైతే ఇక నుంచి డెబిట్ కార్డును ఉపయోగించి వాయిదాల పద్దతిలో కొనుగోలు చేయవచ్చునాని ఎస్‌బీఐ ఛైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు. డెబిట్ కార్డ్ ఈఎంఐ సౌకర్యం కోసం ఎటువంటి అధనపు ఛార్జీలు ఉండవని తెలిపారు.

Related Post