హైదరాబాద్‌లో పెప్సీకో బిజినెస్ హబ్‌

September 13, 2019
img

అంతర్జాతీయ శీతలపానీయాల తయారీ సంస్థ పెప్సీకో హైదరాబాద్‌లో తన వ్యాపార కార్యనిర్వహణ కోసం అతిపెద్ద కార్యాలయాన్ని ఏర్పాటుచేసుకొంటోంది. దీనికోసం లక్ష్మి ఇన్ఫోబన్ ఐ‌టి సెజ్‌లో 3.8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన కార్యాలయాన్ని తీసుకుంది. రాగల మూడేళ్లలో దీనిలో పనిచేసేందుకు 2,500 మంది ఉద్యోగులను నియమించుకోబోతున్నట్లు ఈ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రియరంజన్ ఝా తెలిపారు. అమెరికా వెలుపల పెప్సీకో సంస్థకు గల అతిపెద్ద కార్యాలయం ఇదేనని తెలిపారు. ఈ కార్యాలయం కేంద్రంగా దక్షిణాది రాష్ట్రాలలోని వినియోగదారుల అవసరాలపై అధ్యయనం, మార్కెటింగ్ వ్యూహాల అమలు, హెచ్‌ఆర్‌, ఫైనాన్స్, కూల్ డ్రింక్స్ సరఫరా వ్యవస్థల నియంత్రణ, డిజిటల్ సోల్యూషన్స్ వగైరా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ ఏడాది చివరిలోగా ఇక్కడ ఈ కార్యనిర్వహణ పనులు మొదలుపెట్టాలని భావిస్తోంది. 


Related Post