ఖైరతాబాద్ మెట్రోకి జై!

September 09, 2019
img

ఖైరతాబాద్‌ గణేశుని పుణ్యామని ఆదివారం ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌లో రాకపోకలు సాగించినవారి సంఖ్య అమాంతం రెట్టింపు అయ్యింది. నిన్న ఆదివారం శలవుదినం కావడంతో నగరం నలుమూలల నుంచి ఖైరతాబాద్‌ గణేశుని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దాంతో నిన్న ఒక్క ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌ ద్వారానే 70,000 ప్రయాణికులు రాకపోకలు సాగించారు.

నగరంలో అమీర్‌పేట్‌, ఎల్బీనగర్, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లు అత్యంత రద్దీగా ఉంటాయి. వాటిలో అమీర్‌పేట్‌ స్టేషన్లో రోజుకి 40,000 మంది, ఎల్బీనగర్, హైటెక్‌సిటీ స్టేషన్లలో రోజుకు 30,000 మంది వరకు రాకపోకలు సాగిస్తుంటారు. గణేశుని పుణ్యామని ఖైరతాబాద్‌ స్టేషన్ ఆ రెండు మెట్రో స్టేషన్ల రికార్డులు బద్దలు కొట్టింది. పెరిగిన ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనపు టికెట్ కౌంటర్లు, ప్రతీ నాలుగున్నర నిమిషాలకు ఒక రైలు చొప్పున రాత్రి 11.30 గంటల వరకు మెట్రో నడుతున్నామని మెట్రో రైల్ ఎండీ ఎన్‌విఎస్ రెడ్డి తెలిపారు.

Related Post