హైదరాబాద్‌లో ఓయో వర్క్ స్పేస్ ప్రారంభం

August 24, 2019
img

ఏదైనా కార్యాలయం (ఆఫీసు) ప్రారంభించాలంటే భారీ ఖర్చుతో కూడిన వ్యవహారమనే సంగతి అందరికీ తెలిసిందే. అదీ హైదరాబాద్‌ వంటి మహానగరంలో అయితే ఇంకా కష్టం. అందుకే ఇప్పుడు నగరంలో సకల సౌకర్యాలతో రెడీ-మేడ్ ఆఫీసులు అద్దెకు లభిస్తున్నాయి. కానీ అంతభారం కూడా భరించలేమనుకునేవారికి, స్టార్ట్-అప్ కంపెనీలకు వాటిలో చిన్న క్యాబిన్లు కూడా గంటలు లెక్కన లేదా నెలవారి అద్దెతో లభిస్తున్నాయి. కొత్తగా ఏదైనా వ్యాపారం, సంస్థను ప్రారంభించాలనుకునేవారికి ఇవి చాలా అనువుగా ఉండటంతో వాటికి మంచి ఆదరణ లభిస్తోంది. 

ఓయో గురించి అందరూ వినే ఉంటారు. ఆ సంస్థ గచ్చిబౌలీలో ఇన్నోవ్8 పేరుతో 700 మంది పనిచేసుకునేందుకు వీలుగా ఒక వర్క్ స్పేస్‌ను ప్రారంభించింది. దానిలో హైస్పీడ్ వైఫీ ఇంటర్నెట్ సౌకర్యం, ఏసీ క్యాబిన్స్, ప్రింటర్స్, జిరాక్స్ వంటి మెషిన్లు, కేఫీటేరియా, రిక్రియేషన్ హాల్ వంటి అనేక సౌకర్యాలున్నాయని ఇన్నోవ్8 వ్యవస్థాపకుడు రితేశ్ మాలిక్ తెలిపారు. ఈ వర్క్ స్పేస్‌ ప్రారంభోత్సవ ఆఫర్‌గా డెస్క్ స్పేస్ గంటకు రూ.600 చొప్పున, నెలకు రూ.7,999 చొప్పున అద్దెకు ఇస్తున్నామని తెలిపారు. 24 గంటలు ఉచిత టీ, కాఫీ, ప్రింటర్ సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. 

ఇప్పటికే ఇన్నోవ్8లో వెల్స్ పన్ గ్లోబల్, వెనబుల్ టెక్నాలజీస్, మిల్క్ పోస్ ప్రొడక్ట్స్, నాలెడ్జి హట్, నౌ ఫ్లోట్స్ మొదలైన స్టార్ట్-అప్ కంపెనీలు అవసరమైన వర్క్-స్పేస్ ను ఫేస్‌బుక్‌లో చేసుకున్నాయని రితేశ్ మాలిక్ తెలిపారు.

Related Post