ఎస్.బి.ఐ ఖాతాదారులకు శుభవార్త

July 13, 2019
img

ఇప్పటి వరకు ఆన్‌లైన్‌ బ్యాంకింగ్ ద్వారా నెఫ్ట్ మరియు ఆర్టీజిఎస్ నగదుబదిలీ లావాదేవీలపై వసూలు చేస్తున్న ఛార్జీలను జూలై 1వ తేదీ నుంచి ఎత్తివేసినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన ద్వారా తెలిపింది. ఆగస్ట్ 1వ తేదీ నుంచి మొబైల్ ఫోన్స్ ద్వారా చేసే ఇమ్మిడియెట్ పేమెంట్ సర్వీసస్ (ఐఎంపిఎస్)పై కూడా ఛార్జీలు వసూలు చేయడం నిలిపివేస్తామని తెలిపింది. కానీ నెఫ్ట్ మరియు ఆర్టీజిఎస్ లావాదేవీలలో రెండు లక్షల వరకు మాత్రమే నగదు బదిలీ ఛార్జీల మినహాయింపు ఉంటుందని స్టేట్ బ్యాంక్ తెలియజేసింది.   


Related Post