కేసీఆర్‌ వరమిచ్చినా...బ్యాంకులు ఇవ్వవు

July 05, 2019
img

దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుపడినట్లు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో వివిదవర్గాల ప్రజలకు పించనులు మంజూరు చేస్తే, వాటిని లబ్దిదారులకు ఇవ్వడానికి బ్యాంకులకు మనసొప్పడం లేదు. సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామానికి చెందిన కుందేటి ఎల్లవ్వకి వితంతు పించన్ మంజూరు అయ్యింది. దానిని తీసుకునేందుకు బెజ్జంకిలోని ఆంధ్రా బ్యాంకుకు వెళితే టోకెన్ ఇచ్చారు కానీ పించను మాత్రం ఇవ్వలేదు. గతంలో ఆమె తీసుకున్న లక్ష రూపాయల రుణం తీర్చలేదు కనుక ఆమెకు పించను సొమ్ము ఇవ్వలేమని వెనక్కు తిప్పి పంపారు. ఒకవేళ ఆమె ఎన్నటికీ ఆ రుణం తీర్చలేకపోతే ప్రతీనెల ఆమె పేరున ప్రభుత్వం జమా చేసే పించనును బ్యాంక్ జమా చేసుకొంటుందా? అదే జరిగితే అప్పుడు ఆ వృద్దురాలి పరిస్థితి ఏమిటి? ఆమె ఎవరికి మొర పెట్టుకోవాలి? రాష్ట్రంలో ఆమెవంటి ఇంకెందరున్నారో? వారి పరిస్థితి ఏమిటో? 


Related Post