ధరలు తగ్గేవి పెరిగేవి ఎవంటే...

July 05, 2019
img

కేంద్ర బడ్జెట్‌లో కొన్ని ఉత్పత్తులపై పన్నుల పెంపు లేదా తగ్గింపుల కారణంగా వాటి ధరలలో కూడా మార్పులు రానున్నాయి. 

ధరలు తగ్గే వస్తువులు: సెట్‌టాప్‌ బాక్సులు, సెల్‌ఫోన్‌ ఛార్జర్లు, లిథియం బ్యాటరీలు, ఎలక్ట్రిక్‌ కారులు, ఎలక్ట్రిక్‌ బైక్‌లు, ఛార్జింగ్‌ సైకిళ్లు, గృహ రుణాలు. 

ధరలు పెరిగే వసువులు: బంగారం, పెట్రోల్‌, డీజిల్‌, సబ్బులు, సిగరెట్లు, జీడి పిక్కలు

ఏసీలు, సీసీ కెమెరాలు డిజిటల్‌ వీడియో రికార్డర్లు స్పీకర్లు, 

పీవీసీ పైపులు, సిరామిక్‌ టైల్స్‌, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌, అలాయ్‌ స్టీల్‌ వైర్‌, మెటల్‌ ఫర్నిచర్‌, 

మోటార్‌ బైక్‌లకు వేసే తాళాలు, బైక్‌ హార్న్‌లు, టైర్లు, కార్ల అద్దాలు, రేర్‌ వ్యూ గ్లాస్‌, కార్ల విండో స్క్రీన్‌ వైపర్‌, లైటింగ్‌ సిస్టమ్‌, ఆయిల్‌/ఎయిర్‌ ఫిల్టర్‌లు 

ఆప్టికల్ ఫైబర్‌ కేబుళ్లు, ప్లాస్టిక్‌ ఫ్లోర్‌ కవర్లు, రబ్బరు, న్యూస్‌ ప్రింట్‌, మ్యాగజైన్లు

దేశంలో నానాటికీ వాహనాల వినియోగం పెరిగిపోతున్న కారణంగా వాయు, శబ్ధ కాలుష్యం కూడా పెరిగిపోతోంది. అలాగే డీజిల్, పెట్రోల్ వినియోగం కూడా నానాటికీ పెరిగిపోతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు పెరిగినప్పుడల్లా భారత్‌పై కూడా ఆ భారం పడుతూనే ఉంది. కనుక ఈ సమస్యలన్నిటికీ పరిష్కారంగా ఎలెక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి, వినియోగం పెంచేందుకు కేంద్రప్రభుత్వం వాటిపై పన్ను రాయితీలు ప్రకటించింది. కానీ బైకులు, కార్లకు సంబందించిన వస్తువులపై పన్ను పెంచడంతో వాటి ధరలు పెరుగుతాయి కనుక ఆ పరిశ్రమలపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. 

నిర్మాణరంగంలో ఉపయోగించే పీవీసీ పైపులు సిరామిక్ టైల్స్ ధరలు పెరుగుతాయి కనుక ఆ పరిశ్రమలపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. 

ఇప్పటికే ప్రజలు పుస్తక పఠనం మరిచిపోతున్నారు. న్యూస్ ప్రింట్, మ్యాగజైన్ల ధరలు పెరిగితే ప్రజలు పుస్తకాలు చదివే అలవాటుకు పూర్తిగా దూరం అవుతారు. 

Related Post