హైదరాబాద్‌ మెట్రో సమాచార్

June 14, 2019
img

హైదరాబాద్‌ మెట్రోలో అన్ని కారిడార్లలో కలిపి రోజుకు సుమారు 2.75 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. మెట్రో సర్వీసులు ప్రారంభించిన ఏడాదిన్నరలోగానే ఈ స్థాయికి చేరుకోవడం గొప్ప విశేషమే. ప్రజావసరాలను గుర్తించి తదనుగుణంగా మెట్రోను విస్తరిస్తుండటం, మెట్రో సర్వీసులు ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకు ఎక్కడా వేలేత్తి చూపలేనివిధంగా నాణ్యమైన సేవలు అందిస్తుండటం, ఆర్టీసీ, క్యాబ్, ఆటో, సొంత వాహనాలతో పోలిస్తే మెట్రోలో ప్రయాణం చాలా సుఖవంతంగా ఉండటం హైదరాబాద్‌ మెట్రో విజయానికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. 

అమీర్‌పేట్‌–హైటెక్‌సిటీ కారిడార్ ప్రారంభించినప్పటి నుంచి హైటెక్ సిటీలో పనిచేస్తున్న ఐ‌టి ఉద్యోగులలో చాలామంది తమ తమ కార్లు, ద్విచక్ర వాహనాలను పక్కన పెట్టి మెట్రో రైల్లో రాకపోకలు సాగిస్తుండటంతో ఉదయం, సాయంత్రం వేళ్ళలో మెట్రో రైళ్ళు కిక్కిరిసిపోతునాయి. కనుక ఈ మార్గంలో ప్రయాణిస్తున్న మెట్రో రైళ్ళ సమయాలను సర్దుబాటు చేసి, ఉదయం, సాయంత్రం వేళల్లో అదనంగా మరొక మెట్రో సర్వీసును పెంచుతున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. వచ్చే నెలాఖరులోగా హైటెక్‌సిటీ వద్ద మెట్రో రివర్సల్ సదుపాయం అందుబాటులోకి వస్తుంది. అప్పటి వరకు ఈ అదనపు సర్వీసులు నడిపిస్తామని చెప్పారు. ప్రస్తుతం అమీర్‌పేట్‌–హైటెక్‌సిటీ మార్గంలో ప్రతీ 7.5 నిమిషాలకు ఒక మెట్రో రైల్ నడుస్తోంది. రివర్సల్ సదుపాయం అందుబాటులోకి వస్తే అప్పుడు 3 నిమిషాలకు ఒక రైలు నడిచే అవకాశం ఉంటుంది కనుక మరిన్ని సర్వీసులు పెరుగుతాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. అప్పుడు మెట్రో ప్రయాణికుల సంఖ్య మరింత పెరుగుతుంది. 

Related Post