బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త

June 12, 2019
img

బ్యాంక్ ఖాతాదారులకు ఒక చిన్న శుభవార్త. జూలై 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ నగదు బదిలీలపై ఎటువంటి రుసుములు వసూలు చేయరాదని ఆర్బీఐ అన్ని బ్యాంకులకు ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా రూ.2 లక్షల లోపు ఉండే తక్కువ మొత్తాలను ‘నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌ (నెఫ్ట్‌) ద్వారా, అంతకు మించిన భారీ మొత్తాలను ‘రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌ సిస్టమ్‌’ (ఆర్‌టీజీఎస్‌) ద్వారా నగదు బదిలీలు చేస్తుంటారు. నెఫ్ట్ పై రూ.1 నుంచి రూ.5, ఆర్‌టీజీఎస్‌ లావాదేవీలపై రూ.5 నుంచి రూ.50 వరకు బ్యాంకులు సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తుంటాయి. ఇక నుంచి ఆ ఛార్జీలు ఉండవు. దేశంలో నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకొంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఆన్‌లైన్‌లో సేవలు, వస్తువుల అమ్మకాలు చాలా పెరిగాయి కనుక ఆర్బీఐ తాజా నిర్ణయం వలన ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసే ప్రజలకు కొంత ఊరట లభిస్తుంది.     


Related Post