బస్సులు, మెట్రో రైళ్ళలో మహిళలకు నో టికెట్!

June 03, 2019
img

అవును ఇక నుంచి మహిళలు బస్సులు, మెట్రో రైళ్ళలో ఉచితంగా ప్రయాణించవచ్చు...కానీ హైదరాబాద్‌ నగరంలో కాదు డిల్లీలో! 

డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా ఇవాళ్ళ ఈవిషయాన్ని ప్రకటించారు. మరింతమంది మహిళలు ఈ సురక్షితమైన ప్రజారవాణా వ్యవస్థలను ఉపయోగించుకోవాలనే ఉద్దేశ్యంతోనే వారికి డిల్లీలో తిరిగే సిటీబస్సులు, డిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సులలో ఉచితంగా ప్రయాణించేందుకు వీలు కల్పిస్తున్నామని సిఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ప్రస్తుతం డిల్లీ మెట్రో, బస్సులలో రోజుకు ఎంతమంది మహిళలు ప్రయాణిస్తున్నారు? వారికి ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడం వలన ఆ సంస్థలకు ఎంత నష్టం కలుగుతుంది?ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలేమిటి? అనే మూడు అంశాలపై అధ్యయనం చేసి నివేదికలు సమర్పించాలని అరవింద్ కేజ్రీవాల్ ఆయా సంస్థల అధికారులను కోరారు. ఈ నిర్ణయం వలన ఆ సంస్థలకు నష్టం వాటిల్లడం తధ్యమే కానీ నిత్యం వాటిలో ప్రయాణిస్తున్న లక్షలాదిమంది మహిళలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related Post