హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం

March 05, 2019
img

హైదరాబాద్‌ రోడ్లపై మొట్టమొదటిసారిగా ఈరోజు ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు తీశాయి. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ ఈరోజు ఉదయం మియాపూర్ డిపో-2లో పూజా కార్యక్రమాలు నిర్వహించి 40 ఎలక్ట్రిక్ బస్సులకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ప్రస్తుతం ఇవి నాలుగు వివిద మార్గాల నుంచి ప్రతీ అరగంటకు ఒకటి చొప్పున శంషాబాద్‌ విమానాశ్రయానికి నడుస్తాయని తెలిపారు. త్వరలో నగరంలో ఇతర ప్రాంతాలకు కూడా వీటిని నడుపుతామని చెప్పారు. దేశంలో ఎలక్ట్రిక్ బస్సులు వాడిన మొట్టమొదటి ప్రభుత్వరవాణా సంస్థ టిఎస్ ఆర్టీసీయేనని చెప్పారు. నగరంలో వాయుకాలుష్యం తగ్గించడానికి ఈ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. టిఎస్ ఆర్టీసీ మొత్తం 200 ఎలక్ట్రిక్ బస్సులను దశలవారీగా ప్రవేశపెట్టబోతోంది. 


Related Post