టోల్ గేట్ రూల్స్ మారాయి

March 01, 2019
img

దేశంలో నానాటికీ వాహనాల సంఖ్య పెరిగిపోతుండటంతో సాధారణ రోజులలో కూడా టోల్ గేట్స్ వద్ద బారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. దాంతో టోల్ గేట్ వద్ద టోల్ ఫీజూ చెల్లించి బయటపడటానికి వాహనదారులు చాలాసేపు ఎదురు చూడవలసివస్తోంది. అవుటర్ రింగ్ రోడ్డును వరంగల్, విజయవాడ, బెంగళూరు, ముంబై, నాగపూర్ వెళ్ళే జాతీయ రహదాడులత్ అనుసంధానం చేసినప్పటి నుంచి రోజుకు సగటున లక్షకు పైగా వాహనాలు టోల్ గేట్ ద్వారా ప్రయాణిస్తున్నాయి. కనుక టోల్ గేట్లవద్ద గంటలతరబడి ట్రాఫిక్ జామ్, ఎదురుచూపులు పరిపాటిగా మారిపోయింది.   

ఈ సమస్యకు హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఒక పరిష్కారాన్ని కనుగొంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అవుటర్ రింగు రోడ్డుపై ఉన్న టోల్ గేట్స్ వద్ద ఒకేసారి 20 కంటే ఎక్కువ వాహనాలు నిలిచి ఉన్నట్లయితే టోల్ ఫీజూ చెల్లించకుండా వెళ్లిపోయేందుకు వాహనదారులను అనుమతించాలని టోల్ గేట్లను నిర్వహిస్తున్న గుత్తేదారులను ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.

Related Post