ఎయిర్ ఇండియా తాజా ఆఫర్

January 10, 2019
img

ఎయిర్ ఇండియా నష్టాలను తగ్గించుకునేందుకు కొత్త ఆలోచన చేసింది. రైళ్ళలో లోవర్ క్లాసు టికెట్లు కొనుగోలు చేసినవారికి అప్పర్ క్లాసులో సీట్లు, బెర్తులు ఖాళీ ఉంటే వాటికి ఏవిధంగా ఆటోమేటిక్ గా అప్ గ్రేడ్ అవుతాయో అదే విధంగా ఎయిర్ ఇండియా విమానాలలో బిజినెస్ క్లాసులో ఖాళీగా ఉన్న సీట్లను ఎకానమీ క్లాసు ప్రయాణికులకు కేటాయించాలని నిర్ణయించింది. అయితే దీని కోసం బిజినెస్ క్లాసు టికెట్ ధరలో 25శాతం చెల్లించవలసి ఉంటుంది. ఈ విధానాన్ని దేశంలో ఆరు మెట్రో నగరాలకు వెళ్ళే విమానాలతో పాటు, అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్, జపాన్, హాంకాంగ్ దేశాలకు వెళ్ళే విమానాలలోని అమలుచేయాలని నిర్ణయించినట్లు ఎయిర్ ఇండియా సీఎండీ ప్రదీప్‌సింగ్ ఖరోలా తెలిపారు.
Related Post