ఐసీఐసీ బ్యాంక్ సీఈవో చందాకొచ్చర్ రాజీనామా

October 04, 2018
img

ఐసీఐసీ బ్యాంక్ సీఈవో చందాకొచ్చర్ తన పదవికి రాజీనామా చేయగా దానిని గురువారం బోర్డు సభ్యులు ఆమోదించారు. ప్రస్తుతం తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సందీప్ బక్షి ఆమె స్థానంలో పూర్తిస్థాయి సీఈఓగా నియమితులయ్యారు. ఆయనే ఐసీఐసీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టరు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తారు. 

వీడియో కాన్ కంపెనీకి లబ్ది చేకూర్చేవిధంగా బ్యాంక్ నిబందనలకు విరుద్దంగా రుణం మంజూరు చేసినట్లు చందా కొచ్చర్ పై ఆరోపణలు రావడంతో ఆమెపై విచారణకు జరుగుతోంది. కనుక ఆమె శలవులో ఉన్నారు. ఒకవేళ విచారణలో ఆమె నిర్ధోషి అని తేలితే ఆమె తిరిగి బాధ్యతలు చేపట్టగలిగి ఉండేవారు కానీ హటాత్తుగా ఆమె తన పదవికి రాజీనామా చేయడం దానిని బోర్డు సభ్యులు తక్షణమే ఆమోదించడంతో ఆమెపై వచ్చిన ఆరోపణలు నిజమేనని రుజువు అయ్యాయా? ఇన్నేళ్లుగా ఆమె బ్యాంక్ అభివృద్ధికి చేసిన సేవలను దృష్టిలో ఉంచుకొని ఆమెను గౌరవప్రదంగా పంపించివేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కారణం ఏదైనప్పటికీ ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మకమైనా మార్పులు తెచ్చిన మహిళగా ఆమె పేరు ఎన్నటికీ నిలిచిపోతుంది.

Related Post