ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

September 10, 2018
img

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నందున వాటిపై రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నులో లీటరుకు రూ.2 చొప్పున తగ్గిస్తామని ఈరోజు శాసనసభలో ప్రకటించారు. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయిన్నందుకు ఈరోజు ప్రతిపక్షాలు భారత్ బంద్ నిర్వహిస్తున్నప్పుడే మళ్ళీ వాటి ధరలు స్వల్పంగా పెరగడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ప్రతిపక్షాలు నిర్వహిస్తున్న భారత్ బంద్ పై కేంద్రప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈవిధంగా స్పందించడం విశేషమే. ఏపీ సర్కార్ తీసుకొన్న ఈ నిర్ణయం ప్రభావం ఎన్నికలకు వెళుతున్న టిఆర్ఎస్‌పై కూడా పడే అవకాశం ఉంది. కానీ ఇక ముందుకూడా ఇదే వేగంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినట్లయితే ఏపీ సర్కార్ తగ్గించబోయే ఆ రెండు రూపాయలు మళ్ళీ లెవెల్ అయిపోవచ్చు.  


Related Post