నాంపల్లి మెట్రో స్టేషన్ వద్ద మరో అద్భుతం

September 08, 2018
img

నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద మెట్రో రైల్వే స్టేషన్ నిర్మాణానికి తగినంత స్థలం లభించకపోవడంతో ఒకవైపు మాత్రమే మెట్లు ఉండేవిధంగా విలక్షణంగా మెట్రో స్టేషన్ నిర్మిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అదే కారణం చేత ఆ ప్రాంతంలో 10 అంతస్తుల మల్టీ లెవెల్ పార్కింగ్ భవనాన్ని నిర్మించబోతోంది. మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి దానికి ఈరోజు ఉదయం శంఖుస్థాపన చేశారు. 

దీనిని పిపిపి విధానంలో నిర్మించబోతున్నామని చెప్పారు. దీని వలన తక్కువ స్థలంలో ఎక్కువ వాహనాలు పార్కింగ్ చేసుకోవచ్చునని తెలిపారు. ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ కోసమే విదేశాలలో ఊపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించబోతున్నామని తెలిపారు. నగరంలో పార్కింగ్ సమస్యలను తీర్చేందుకు ఇటువంటి 40 భవనాలు నిర్మించబోతున్నట్లు చెప్పారు. ఇక ఎల్బీ నగర్- అమీర్ పేట మార్గంలో అన్ని రకాల పరీక్షలు త్వరలోనే పూర్తయ్యే అవకాశం ఉందని కనుక ఈనెలాఖరులోపుగానే ఆ మార్గంలో మెట్రో సర్వీసులు ప్రారంభించవచ్చని ఎన్విఎస్ రెడ్డి మీడియా ప్రతినిధులకు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఇది మొట్టమొదటి మల్టీ లెవెల్ పార్కింగ్ భవనంగా నిలువబోతోంది.          


Related Post