మెట్రో రద్దీ పెరగడానికి కారణం ఏమిటంటే..

August 18, 2018
img

ఆగస్ట్ 16వ తేదీన హైదరాబాద్‌ మెట్రో రైళ్లలో 1.07 లక్షల మంది ప్రయాణించారని మెట్రో ఎండి ఎన్వీఎస్‌రెడ్డి చెప్పారు.  అయితే ఆయన దానికి కారణం మాత్రం చెప్పలేదు. ఆ రోజు ఉదయం అందరూ ఆఫీసులకు బయలుదేరే సమయంలో ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రి సమీపంలో ఒక స్కూల్ బస్సు పాడవడంతో రోడ్డు మద్యలో నిలిచిపోయింది. ఆ కారణంగా ఎస్ఆర్ నగర్, మూసాపేట, అమీర్ పేట వరకు చాలా సేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. ట్రాఫిక్ పోలీసులు వచ్చి క్రేన్ తో ఆ స్కూలు బస్సును అక్కడి నుంచి తరలించే వరకు బారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాంతో ఆటోలు, బస్సులలో ఆఫీసులకు వెళుతున్నవారు అవి దిగి దగ్గరలోనే ఉన్న మెట్రో పేట్ స్టేషన్ వరకు నడుచుకొంటూ వెళ్ళి మెట్రో రైళ్ళలో తమ గమ్యస్థానాలు చేరుకొన్నారు. ఆ కారణంగా ఆగస్ట్ 16న మెట్రో ప్రయాణించిన వారి సంఖ్య కొంత పెరిగి ఉండవచ్చు కానీ ట్రాఫిక్ జామ్ కారణంగా ఒకే ప్రాంతం నుంచి 30-40,000 మంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించి  ఉండకపోవచ్చు. ఆరోజు వేరే ఇతర కారణాల చేత మెట్రో ఎక్కినవారి సంఖ్య పెరిగి ఉండవచ్చు. కారణాలు ఏవైనప్పటికీ హైదరాబాద్‌ మెట్రోలో ప్రయాణించేవారి సంఖ్య పెరిగినందుకు సంతోషమే కదా!


Related Post