బి.ఎస్.ఎన్.ఎల్. నుంచి రెండు ఆకర్షణీయమైన ప్యాక్స్

August 09, 2018
img

డేటా...కాల్స్..ఎస్.ఎం.ఎస్..వాడకంలో యువతదే ప్రధమస్థానం. కనుక వారికి అందుబాటు ధరలలో ప్యాకేజీ అందిస్తే ఇక తిరుగు ఉండదు. ఈ విషయం జియో, ఎయిర్ టెల్ తదితర సంస్థలు ఎప్పుడో కనిపెట్టి అందుకు అనుగుణమైన ప్లాన్స్ అమలుచేస్తున్నాయి. ఇప్పుడు బి.ఎస్.ఎన్.ఎల్. కూడా వాటితో పోటీ పడుతూ రెండు ఆకర్షణీయమైన ప్లాన్స్ ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ నెల 10 నుంచి 25 వరకు డైలీ, వీక్లీ ప్లాన్స్ ను అందుబాటులోకి తెస్తోంది. 

డైలీ ప్లాన్ లో రోజుకు కేవలం రూ.9లకే అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2జిబి డేటా, రోజుకు వంద మెసేజులు అందిస్తుంది. 

వీక్లీ ప్లాన్ లో కేవలం రూ.29లకే ఏడు రోజులు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2జిబి డేటా, రోజుకు వంద మెసేజులు అందిస్తుంది.

ఈ రెండు ప్లాన్స్ యువతను ముఖ్యంగా పరిమిత బడ్జెట్ తో నెట్టుకు వచ్చే కాలేజీ విద్యార్ధులను తప్పకుండా ఆకర్షిస్తాయని చెప్పవచ్చు.   


Related Post