మహబూబ్ నగర్ లో ఐటిపార్క్

July 07, 2018
img

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో గల దివిటిపల్లి గ్రామం వద్ద 500 ఎకరాల విస్తీర్ణంలో ఐటిపార్క్ ఏర్పాటుకు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖా మంత్రి కేటిఆర్ ఈరోజు శంఖుస్థాపన చేయబోతున్నారు. ఇక్కడ హైవేకు ఆనుకొని 400 ఎకరాల ప్రభుత్వభూమి ఉంది. ఐటిపార్క్ ఏర్పాటుకు మరో 100 ఎకరాలు అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కనుక రైతుల నుంచి భూసేకరణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 18 ఐటి సంస్థలు ఈపార్కులో తమ సంస్థలను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయి. స్వదేశీ సంస్థలతో పాటు ఇక్కడ విదేశీ ఐటికంపెనీలు కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ పార్క్ లో ఐటి సంస్థలు వచ్చినట్లయితే వేలాదిమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.          


Related Post